Rahul Gandhi Telangana Tour : తెలంగాణకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. ఎప్పుడు, ఎందుకు వస్తున్నారంటే..

రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా పని చేయాలన్నారు.

Rahul Gandhi

Rahul Gandhi Telangana Tour : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 27న తెలంగాణకు వస్తారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సంవిధాన్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గొంటారని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ వార్నింగ్ పైన మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉంది..
అందరి రిపోర్టు కేసీ దగ్గర ఉందని, 20ఏళ్లు దృష్టిలో పెట్టుకుని పని చేయాలని కేసీ వార్నింగ్ ఇచ్చారని అన్నారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు మహేశ్ కుమార్ గౌడ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారాయన.

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసి పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఇద్దరూ కూడా తెలంగాణకు వస్తారని తెలిపారు. సంవిధాన్ బచావో ర్యాలీలో వారు పాల్గొంటారని వెల్లడించారు.

Also Read : తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాబు క్విక్ రియాక్షన్.. బాధితుల పక్షాన నిలిచి ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా ప్లాన్!

మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్..
దీంతో పాటు ఇటీవల కేసీ వేణుగోపాల్ నిర్వహించిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి సంబంధించిన అంశాలను మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీక్రెట్ సర్వేపై ఇంటర్నల్ గా డిస్కషన్ చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటోందన్నారు.

Rahul Gandhi

కచ్చితంగా మంత్రులంతా కూడా ప్రజల్లో ఉండాల్సిందేనన్నారు. ఎమ్మెల్యేలు సైతం ప్రజలకు, క్యాడర్ కు అందుబాటులో ఉండాల్సిందేన్నారు. ప్రతి నెల ఒక మంత్రి ఒక జిల్లాలో పర్యటించాలి, క్యాడర్ కు అందుబాటులో ఉండాలి. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా పని చేయాలన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు..
అటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులుగా నలుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లు వివరించారు. వారిలో అల్ఫోస్ నరేందర్ రెడ్డి పేరును ప్రధానంగా ముఖ్యమైన నేతలంతా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది.

కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు డిమాండ్ చేసేందుకు ఆస్కారం..
‘తెలంగాణలో కులగణన సర్వే 95శాతం పూర్తైంది. రాహుల్ గాంధీ చలవతోనే కులగణన సర్వే. కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను డిమాండ్ చేసేందుకు ఆస్కారం. వడ్డెర కులస్తులు కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులతో సరిపెట్టుకోవద్దు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఎదగాలి. బీసీలపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారు. బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

 

Also Read : టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా దానం నాగేందర్.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎందుకు మాట్లాడుతున్నట్లు?