తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాబు క్విక్ రియాక్షన్.. బాధితుల పక్షాన నిలిచి ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా ప్లాన్!
జగన్ పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టాలంటూ బాధితులకు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తోంది టీడీపీ.

Pawan and chandrababu
Tirupati stampede: ప్రాబ్లమ్ ఏదైనా..సమస్య ఎక్కడున్నా..ఇష్యూ మరేదైనా..రియాక్ట్ అవడం ఇంపార్టెంట్. తిరుపతి తొక్కిసలాట ఘటన ఇష్యూలో ఇలాంటి స్ట్రాటజీని ప్లే చేశారట ఏపీ సీఎం చంద్రబాబు. ఘటన జరిగిందని మీడియా రిపోర్ట్ చేసిన నిమిషాల్లోనే క్విక్‌గా రెస్పాండ్ అయ్యారు. వెంటనే టీటీడీ ఈవో, ఛైర్మన్‌తో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు.
బాధితులకు చికిత్స, వైకుంఠ ద్వార దర్శనాలపై ఆదేశాలిచ్చారు. అంతటితో ఆగకుండా ఘటన జరిగిన మరునాడే తిరుపతికి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి..అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. తొక్కిసలాట ఎందుకు జరిగింది..ఆ వెంటనే చేపట్టిన సహాయక చర్యలు ఏంటి.? అంబులెన్స్లు ఏ సమయానికి వచ్చాయి.? బాధితులను ఆస్పత్రికి ఏ టైమ్కు తరలించారని అధికారులను ప్రశ్నించారు.
సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడంపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పలువురు అధికారులపై సస్పెన్షన్, బదిలీ వేటు వేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారంతో పాటు గాయపడి చికిత్స పొందుతున్న వారికి సాయం ప్రకటించారు. గాయపడిన వారికి శ్రీవారి దర్శనం చేయించి చంద్రబాబు తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలేంటో ఆగమశాస్త్ర పడింతులే తేల్చాలని చెప్పి..తిరుమల ఆచార వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు.
తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్
ఏపీ సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించాక.. డిప్యూటీ సీఎం పవన్ కూడా తిరుపతికి వెళ్లారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. భక్తుల చావుకు కారణమైన వారిని ఎందుకు వదిలిపెడుతున్నారని..కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ. ఇదే సమయంలో అటు కూటమి నుంచి అపోజిషన్కు కౌంటర్ స్టార్ట్ అయింది.
జగన్ పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టాలంటూ బాధితులకు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తోంది టీడీపీ. తమ దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ విజువల్స్ ఉన్నాయని..త్వరలోనే రిలీజ్ చేస్తామంటున్నారు. మరోవైపు చంద్రబాబు బాధితులను పరామర్శించినప్పుడు మానవత్వం చూపించారని..ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ వైసీపీని కార్నర్ చేస్తున్నారు పసుపు పార్టీ కార్యకర్తలు. తొక్కిసలాటలో గాయపడిన వారికి కూడా సాయం చేసి..దర్శనం చేపించి బాధ్యత అంటే ఎలా ఉంటుందో చూపించామంటోంది టీడీపీ.
తొక్కిసలాట ఘటనపై బాబు త్వరగా రియాక్ట్ అవడం..చంద్రబాబుతో సహా పవన్ బాధితులకు క్షమాపణ చెప్పి తమ మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో చూపించారు. అధికారులు, పోలీస్ సిబ్బంది వైఫల్యమే అయినా ప్రభుత్వాన్ని నడిపే నాయకులుగా.. బాబు, పవన్ బాధ్యతగా వ్యవహరించారని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు.
క్విక్ రియాక్షన్తో వ్యవహారం మొత్తం చక్కపెట్టే ప్రయత్నం
మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో ప్రతిపక్షం నుంచి డిమాండ్ రాకముందే ప్రభుత్వం సాయం ప్రకటించిందని.. బాధితులకు భరోసా ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అయితే వైసీపీ అధినేత పర్యటనలో ప్రభుత్వాన్ని తిట్టించాలని చేసిన కుట్రలు బయట పడ్డాయని.. ప్రతిపక్షం చేసిన నీచ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయని అంటున్నారు కూటమి నేతలు.
తిరుపతి తొక్కిసలాట ఘటనతో పెద్దఎత్తున దుమారం లేచినా..క్విక్ రియాక్షన్తో వ్యవహారం మొత్తం చక్కపెట్టే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్. అయితే సారీ చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ తెరమీదకు తెచ్చిన ఇష్యూతో కాస్త హడావుడి నడిచింది. అయితే క్షమాపణ చెప్పేందుకు ఇబ్బందేమి లేదని..రెస్పాన్సిబుల్‌గా సారీ చెప్పడం కొసమెరుపు అయింది.
బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తామన్న టీటీడీ ఛైర్మన్..మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఇస్తామన్నారు. వారి పిల్లల చదువు బాధ్యత తీసుకునే సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా పెద్ద ఇష్యూ అయి..మెల్లిగా పొలిటికల్ టర్న్ తీసుకుని.. ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గరే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే సీసీ టీవీ ఫుటేజ్ అంటూ టీడీపీ చేస్తున్నా హడావుడితో ఈ ఇష్యూ ఇంక ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.
తెలివిగల పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలో స్కూల్ బాలికలకు చెప్పిన డీఐజీ మేడం