Rahul Gandhi : ఇవి దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు : రాహుల్ గాంధీ

అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి..కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్..ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Rahul Gandhi Speech at Jagtial Congress Vijayabheri Sabha : కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశలు ఫలించలేదన్నారు.తెలంగాణలో రాచరిక పాలన సాగుతోంది అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామని..క్వింటా పసుపుకు రూ.12వేలు ధర కల్పిస్తాంమని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ బంధం కాదు.. ప్రేమానుబంధం అని..ఈ అనుబంధం ఈనాటిది కాదు… నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందని అన్నారు.

బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీల మధ్యా చీకటి ఒప్పందం ఉంది అంటూ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, బీఆర్ఎస్, తెలంగాణలో బీజేపీకి బీఆరెస్, ఎంఐఎంలు సహకరించుకుంటున్నాయి అంటూ ఆరోపించారు.నేను బీజేపీపై పోరాటం చేస్తుంటే.. నాపై కేసులు పెట్టారని…నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు.. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించారు అన్నారు. నా ఇల్లు భారత ప్రజలు, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉంది.. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో..కానీ ప్రజల హృదయాల్లోంచి కాదన్నారు.

Rahul Gandhi : టిఫిన్ బండి వద్ద దోసెలు వేసిన రాహుల్ గాంధీ .. జగిత్యాల పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు

కులగణనపై పార్లమెంటులో డిమాండ్ చేశానని కానీ తన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ కులగణనకు ముందుకు రావడంలేదు..కులగణన అటు మోదీకి.. ఇటు కేసీఆర్ కు ఇష్టంలేదన్నారు.దేశ బడ్జెట్ కేటాయింపులో ఐఏఎస్ లది కీలక పాత్రగా ఉంటుందని అటువంటి అధికారుల్లో 90శాతం అగ్రవర్ణాలకు చెందినవారేనని అన్నారు.అందుకే కులగణన చేస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు.

ప్రధాని మోదీ దేశ సంపదను వ్యాపారవేత్త అదానికి కట్టబెడతున్నారు అంటూ విమర్శించారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేసిన రాహుల్ అధికారంలోకి రాగానే. బీసీ కులగణన చేపడతామని వెల్లడించారు. కులగణన ఎక్స్ రే లాంటిది…కులగణన జరిగితేనే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

Supreme Court : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌.. కారును పోలిన గుర్తులు తొల‌గించాలని వేసిన పిటిష‌న్ కొట్టివేత

అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి..కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్..ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం అంటూ రాహుల్ అంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ సభలో రాహుల్ గాంధీ హిందీ ప్రసంగానికి తెలుగులో ట్రాన్స్ లేట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. జీవన్ రెడ్డి గ్రేట్ ట్రాన్స్ లేషన్ అంటూ మెచ్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు