Supreme Court : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌.. కారును పోలిన గుర్తులు తొల‌గించాలని వేసిన పిటిష‌న్ కొట్టివేత

అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా అని నిలదీసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌.. కారును పోలిన గుర్తులు తొల‌గించాలని వేసిన పిటిష‌న్ కొట్టివేత

Supreme Court dismiss BRS petition

Supreme Court Dismissed BRS Petition : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బ‌ తగిలింది. కారును పోలిన చ‌పాతీ రోల‌ర్‌, రోడ్డు రోల‌ర్ త‌దిత‌ర గుర్తులు తొల‌గించాలంటూ బీఆర్ఎస్‌ వేసిన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓట‌ర్ల‌కు అన్నీ తెలుస‌ని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కారును పోలిన చ‌పాతీ రోల‌ర్‌, రోడ్డు రోల‌ర్ త‌దిత‌ర గుర్తులు తొల‌గించాలంటూ బీఆర్ఎస్‌ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. మునుగోడు ఉప ఎన్నిక‌లో కారును పోలిన గుర్తుల‌తో న‌ష్ట‌పోయామ‌ని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాస్యులు కాదని ధర్మాసనం తెలిపింది. వాళ్లకు కారు, చపాతి, రోలర్, రోడ్డు రోలర్ కు తేడా తెలియదు అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగింది. హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.

Chandrababu : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. అప్పటివరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం

అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా అని నిలదీసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్ తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.