Governor Tamilisai : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు.

Governor Tamilisai Soundararajan

Republic Day 2024 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి తమిళిసై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.

Also Read : Pawan Kalyan : చిరంజీవి, వెంకయ్యనాయుడులతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు

మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి దానిని తయారు చేశారని, అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం తోడ్పడిందని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు.. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి వారికి ఉంది అంటూ గవర్నర్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని, గడిచిన పదేళ్లలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారని అన్నారు. నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని, ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Also Read : Padma Awards 2024: తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయం అన్నారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను పున:నిర్మించుకుంటున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు