Musi River: మూసీలో రెస్క్యూ ఆపరేషన్.. వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు..

యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు.

Musi River: మూసీలో రెస్క్యూ ఆపరేషన్.. వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు..

Musi River

Updated On : August 5, 2025 / 10:03 AM IST

Musi River : యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ నది ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ దాదాపు ఐదు గంటలు శ్రమించి పశువుల కాపరులను కాపాడారు. తాళ్ల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తుందని, ప్రజలెవరూ మూసీ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని డీసీపీ సూచించారు.

Also Read: తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్.. వారందరికీ రైతు బీమా.. ఈ ఫస్ట్‌వీక్‌లోగా అప్లయ్ చేసుకునే వెసులుబాటు..