బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. బిడ్డను అరెస్ట్ చేసినప్పటికీ కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
అరెస్టు చేస్తున్న సమయంలో ఆమె వద్దకు ఎందుకు వెళ్లలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు గమనించాలని చెప్పారు. కవిత అరెస్టుపై మోదీ, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. కవిత ఎపిసోడ్ టీవీ సీరియల్ మాదిరిగా ఉందని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి కలవడం ఆ బీఆర్ఎస్ నేత ఇష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి తనను కలుస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. అండగా ఉంటామని చెబుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఎంఐఎంతో కాంగ్రెస్ బంధం బలంగానే ఉందని, నిన్న ఇఫ్తార్ విందులో ఇది కనబలేదా? అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తమతో ఎంఐఎంని కలుపుకుపోతామని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు