ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ఆ ప్రోగ్రాంలో పాల్గొననున్న సీఎం
అనంతరం ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు.

CM Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ‘అడ్డా’ ప్రోగ్రాంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన వెళ్లారు. రేవంత్ రెడ్డి వెంట డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు అడ్డా ప్రోగ్రాంలో ఆయన పాల్గొంటారు.
ఢిల్లీ పర్యటనలో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల వ్యూహానికి సంబంధించి అడ్డా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు.
అక్కడి నుంచి బుధవారం ముంబైకి వెళ్తారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని, తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి గడువు తక్కువగా ఉండడంతో ముఖ్యనేతలు అందరూ ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు.
Pawan Kalyan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్