TPCC Chief : టీపీసీసీ చీఫ్‌‌గా రేవంత్, సీనియర్ల స్పందన

ఎన్నో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెర పడింది.. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు..

TPCC Chief : టీపీసీసీ చీఫ్‌‌గా రేవంత్, సీనియర్ల స్పందన

Tpcc

Updated On : June 26, 2021 / 9:33 PM IST

Rewanth Reddy : ఎన్నో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెర పడింది.. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు.. అప్పటి నుంచి తరువాత సారథి ఎవరన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగింది.. అనేక సార్లు వాయిదా పడ్డ నియామకంపై ఎట్టకేలకు తేల్చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం.. సీనియర్లు వ్యతిరేకిస్తున్నా అధిష్టానం రేవంత్‌వైపే మొగ్గు చూపింది.

సోనియా, రాహుల్‌గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. గతంలో రేవంత్‌ రెడ్డిని వ్యతిరేకించిన మాట వాస్తవమేనని, కాంగ్రెస్‌ కార్యకర్తగా సోనియా, రాహుల్‌ నాయకత్వాన్ని గౌరవిస్తామన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు సోనియా గుర్తించారన్నారు సీనియర్ నేత మల్లు రవి అన్నారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడం సంతోషకరంగా అభివర్ణించారు. కొందరు రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించారనే విషయాన్ని ఆయన అంగీకరించారు. అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.