పెరుగుతున్న ఉష్ణోగ్రతలు : రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్ : మాల్దీవుల నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు భూమికి 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని , దీని ప్రభావంతో తేమ గాలులు వీస్తున్నందున తెలంగాణాలో శనివారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో క్రమేపి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, చలి తగ్గుతోందని అన్నారు. మెదక్‌లో శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా 16, హన్మకొండలో 18, హైదరాబాద్‌లో 19, ఆదిలాబాద్‌లో 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట సాధారణంకన్నా 2 డిగ్రీలు ఉష్ణోగ్రత అదనంగా ఉంటోందని అధికారులు వివరించారు.