Road Accident: జహీరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం, చిన్నారి సహా నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 8 నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు

Road Accident: నూతన సంవత్సరం ప్రారంభంలోనే దేశంలో వరుస ప్రమాదాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట, హరియాణాలో మైనింగ్ పేలుడు వంటి ప్రమాదాలు ఆందోళనకు గురిచేశాయి. తెలంగాణలోనూ శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 8 నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పడంతో.. పల్టీలుకొడుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సహా 8 నెలల చిన్నారి మృతి చెందింది.

Also Read: Fake Doctor: 20 ఏళ్లుగా ఆసుపత్రి నడిపిస్తున్న నకిలీ వైద్యుడు అరెస్ట్

ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జవగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా అక్కడిక్కడే మృతి చెందాడు. మృతిచెందిన భార్యాభర్తలు చిన్నారి అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి చెందిన బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు( 8 నెలలు)గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు

Also read: VyshnoDevi Temple: న్యూ ఇయర్ వేళ ఆలయంలో విషాదం

ట్రెండింగ్ వార్తలు