RTC: ఆర్టీసీ కొత్త బస్ పాస్‌లు.. ఈ రూట్లలో జస్ట్ రూ.5,260
ఆర్టీసీ ప్రయాణికుల ఆదరణ పొందడంతోపాటు.. ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రణాళికలు అమలు చేస్తోంది

Pushpak bus
RTC: గ్రేటర్ ఆర్టీసీ ప్రయాణికుల ఆదరణ పొందడంతోపాటు.. ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో రూట్ పాస్ లను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ పోర్ట్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
Also Read: Telangana Govt: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు ప్రోత్సహించేలా.. రేవంత్ సర్కార్ సరికొత్త పథకం..
ప్రతీరోజూ వివిధ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 53 పుష్పక్ ఏసీ బస్సులు ఎయిర్ పోర్టులకు నడుస్తున్నాయి. 24గంటల పాటు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ పోర్టు ప్రయాణికుల కోసం వీటిని ఆర్టీసీ నడుపుతుంది. ప్రతిరోజూ 55వేల మంది డొమెస్టిక్ ప్రయాణికులు, మరో 15వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్పక్ లను నడుపుతున్నప్పటికీ ఆదరణ తక్కువగానే ఉంది. దీంతో వివిధ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఎయిర్ పోర్టులో సుమారు 12వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఈ ఉద్యోగులంతా వివిధ మార్గాల్లో ఎయిర్ పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు ఆర్టీసీ రూట్ పాస్ లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో.. నగరంలో ఎక్కడి నుంచైనా ఎయిర్ పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నెలవారీ పాస్ రూ.5,260. శంషాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకు రూ.2,110, ఆరాంఘర్, బాలాపూర్ నుంచి ఎయిర్ పోర్టుకు రూ.3,160, ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్టుకు రూ.4,210గా రూట్ పాస్ ఛార్జీలను నిర్ణయించింది. ప్రయాణీకులు నెలవారీ పాస్ లతో పాటు తమ అవసరాలకు అనుగుణంగా ఈ నాలుగు మార్గాల్లో రూట్ పాస్ లను తీసుకునే అవకాశం ఉంటుంది.