Gold Rate: మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.

Gold
Gold And Silver Price: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు భారీ శుభవార్త. గోల్డ్ రేటు మళ్లీ తగ్గింది. వరుసగా నాల్గో రోజు బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధర కిందకు దిగొస్తోంది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 280 తగ్గింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.250 తగ్గింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో 24క్యారట్ల గోల్డ్ పై రూ.3వేలకుపైగానే తగ్గింది. మరోవైపు వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ (31.10గ్రాముల) 3,030 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. తద్వారా గడిచిన నాలుగు రోజుల్లో ఔన్సు గోల్డ్ పై సుమారు 100 డాలర్లకుపైగానే తగ్గింది. గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.82,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,380కు పడిపోయింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,530 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,850 కాగా.. 24క్యారెట్ల ధర రూ.90,380 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.94,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,03,000 వద్ద కొనసాగుతుంది.