Rythu Bandhu Scheme: రైతుబంధు సాయం.. నగదు ఖాతాలు సరి చూసుకోండి

రైతు బంధు సాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే..ముందుగా...వారి వారి బ్యాంకు అకౌంట్లో చెక్ చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Rythu Bandhu Scheme: రైతుబంధు సాయం.. నగదు ఖాతాలు సరి చూసుకోండి

Rythu Bandhu Scheme

Updated On : May 31, 2021 / 11:50 AM IST

Rythu Bandhu Bank Account : రైతు బంధు సాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ముందుగా.. వారి వారి బ్యాంకు అకౌంట్లు నంబర్లు సరి చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో విలీనం అయిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లు, IFSC కోడ్ మారాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరోసారి నూతన అకౌంట్ల నంబర్లు, IFSC కోడ్ నంబర్లను తీసుకుని ఆయా క్లస్టర్లకు చెందిన బ్యాంకు ఏఈవోలకు అందచేయాలని సూచించారు. జూన్ 10వ తేదీ వరకు సంబంధిత ఏఈవోలకు కొత్త పాస్ బుక్‌లతో పాటు..ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

ఒకవేళ..బ్యాంకు అకౌంట్ మార్చుకోవాలని అనుకొనే వారు..కూడా కొత్త అకౌంట్ నంబర్ అందించాలని, భూముల క్రయ విక్రయాలు, వారసత్వ క్రమంలో కొత్త పాస్‌బుక్‌లు వచ్చిన వారు రైతు బంధు కోసం కొత్తగా నమోదు చేసుకోవాలన్నారు.

Read more : No Covid vaccine, no liquor : కొత్త రూల్.. నో వ్యాక్సిన్ నో లిక్కర్.. మందుబాబులకు షాక్