Salar Jung Museum: సాలర్ జంగ్ మ్యూజియానికి 6రోజులు ఉచితం
ఇంటర్నేషనల్ మ్యూజియం వీక్ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాలర్ జంగ్ మ్యూజియం 6రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. మే18వ తేదీన యూనియన్ కల్చరల్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మ్యూజియం డేను జరుపుతుంది.

Salar Jung Museum
Salar Jung Museum: ఇంటర్నేషనల్ మ్యూజియం వీక్ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాలర్ జంగ్ మ్యూజియం 6రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. సాలర్ జంగ్ మ్యూజియం డైరక్టర్ డా. ఏ నాగేందర్ రెడ్డి ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. మే18వ తేదీన యూనియన్ కల్చరల్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మ్యూజియం డేను జరుపుతుంది.
మ్యూజియంలు అంటే కల్చరల్ హెరిటేజ్ స్టోర్ హౌజ్ లు మాత్రమే కాదని ద పవర్ ఆఫ్ మ్యూజియంస్ అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించనున్నారు.
సందర్శకులకు అవగాహన కల్పిస్తుండటంతో పాటు చరిత్ర గురించి వివరిస్తూ విద్యాసంస్థలను విజ్ఞానవంతులను చేస్తుంది. మ్యూజియంలు సందర్శకులను చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడే విద్యా కేంద్రాలుగా ఉపయోగపడతాయి.
Read Also: ఫ్రీగా సాలార్ జంగ్ మ్యూజియం.. చిన్నారుల కోసం కాంపిటీషన్లు
ఇందులో భాగంగా సందర్శకులంతా ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్, ఫోటోగ్రఫీ పోటీలను కూడా ఏర్పాటు చేసింది. మే 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు.