Salar Jung Museum: ఫ్రీగా సాలార్ జంగ్ మ్యూజియం.. చిన్నారుల కోసం కాంపిటీషన్లు

బాలల దినోత్సవం పురస్కరించుకొని నవంబర్ 14నుంచి 20 వరకూ సాలార్ జంగ్ మ్యూజియం వేదికగా చిన్నారులకు కాంపిటీషన్లు నిర్వహించనున్నారు.

Salar Jung Museum: ఫ్రీగా సాలార్ జంగ్ మ్యూజియం.. చిన్నారుల కోసం కాంపిటీషన్లు

Salar jung museum

Updated On : October 30, 2021 / 9:38 PM IST

Salar Jung Museum: బాలల దినోత్సవం పురస్కరించుకొని నవంబర్ 14నుంచి 20 వరకూ సాలార్ జంగ్ మ్యూజియం వేదికగా చిన్నారులకు కాంపిటీషన్లు నిర్వహించనున్నారు. ఆరో తరగతి – ఏడో తరగతి, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతిలు కలిపి రెండు గ్రూపులుగా కేటాయించి పోటీలు ఏర్పాటుచేస్తారు. వ్యాసరచన పోటీలను ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు నాలుగు భాషల్లో నిర్వహిస్తారు.

నవంబర్ 15 ఉదయం 11 గంటలకు హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో రెండు గ్రూపులకు పోటీలు జరుగుతాయి. నవంబర్ 16న కూడా అవే పోటీలు నిర్వహించగా.. నవంబర్ 17 ఉదయం 11గంటల నుంచి డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది.

మరింత సమాచారం కోసం రమణి కుమారి, గైడ్ లెక్చరర్ 9666964379ను సంప్రదించాలని మ్యూజియం నిర్వాహకులు వెల్లడించారు.

…………………………………………..: ఎలన్‌ మస్క్‌ సంపాదన.. పాక్‌ జీడీపీ కన్నా ఎక్కువ!