Sangareddy MLA : 15 రోజులు ఎలాంటి కామెంట్స్ చేయను.. ఆ తర్వాత చెబుతా – జగ్గారెడ్డి
పోతో పోనీ..దరిద్రం పోతుందని కామెంట్స్ చేసినట్లు జగ్గారెడ్డికి సమాచారం అందింది. పార్టీ నాయకులతో వేణుగోపాల్ అన్నట్లు జగ్గారెడ్డికి నాయకులు తెలిపారు. హరికర వేణుగోపాల్ వ్యాఖ్యలపై ఆయన..

Jagga Reddy
Jaggareddy Comments : సీనియర్ల సూచన మేరకు తాను 15 రోజుల వరకు రాజీనామాపై ఎలాంటి కామెంట్స్ చేయనని, తనను కలిసిన వారు సోనియా, రాహుల్ గాంధీల అపాయింట్ ఇప్పించాలని కోరారు జగ్గారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి టాపిక్ కాక పుట్టిస్తోంది. ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడడం, వెంటనే సీనియర్లు రంగంలోకి దిగి ఆయన్ను బజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో అధిష్టానికి ఏకంగా మూడు పేజీల లేఖ రాశారు. సోనియా, రాహుల్ అపాయింట్ ఇప్పిస్తే తన ఆవేదనను వారిముందే వ్యక్తపరుస్తానని, లేనిపక్షంలో తనమాటకు కట్టుబడి ఉంటానన్నారు జగ్గారెడ్డి.
Read More : Jagga Reddy : రాజీనామా చేస్తా, నో డౌట్.. టీఆర్ఎస్‌లోకి వెళ్లను-జగ్గారెడ్డి
2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో తనకు జరుగుతున్న అవమానాన్ని మరోసారి వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీ, నాయకత్వంపై తనకు ఎలాంటి కోపం లేదని, తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే.. గాంధీ భవన్ లో కొంతమంది కామెంట్స్ చేశారని తనకు తెలిసిందని, తన సమస్యకు మందు నా దగ్గరనే ఉందన్నారు. టీ కప్పులో తుపాన్ అంటున్నారని, అసలు మూలాలకు వెళ్లడం లేదని విమర్శించారు. సభ్యత్వ నమోదు ఇంచార్జి హరికర వేణుగోపాల్ రెడ్డిపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : Jagga Reddy: రాజీనామాపై.. కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ
పోతో పోనీ..దరిద్రం పోతుందని కామెంట్స్ చేసినట్లు జగ్గారెడ్డికి సమాచారం అందింది. పార్టీ నాయకులతో వేణుగోపాల్ అన్నట్లు జగ్గారెడ్డికి నాయకులు తెలిపారు. హరికర వేణుగోపాల్ వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ కి సన్నిహితులే ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి 15 రోజుల్లో జగ్గారెడ్డికి సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ దొరుతుందా ? తర్వాత నెక్ట్స్ స్టెప్ ఏంటీ అనేది ఉత్కంఠ నెలకొంది.