Jagga Reddy: రాజీనామాపై.. కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

పార్టీలో తనపై కోవర్ట్ ముద్ర వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. పలు విషయాలను పేర్కొంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖరాశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి లేఖరాశారు జగ్గారెడ్డి.

Jagga Reddy: రాజీనామాపై.. కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

Jagga

Jagga Reddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న ముసలం మరింత ముదురుతున్న సమయంలో.. రంగంలోకి దిగిన సీనియర్ నేతలు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగించి ఆయన మనసు మార్చే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన నుంచి ప్రస్తుతానికి వెనక్కు తగ్గుతున్నట్లు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే పార్టీలో తనపై కోవర్ట్ ముద్ర వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. పలు విషయాలను పేర్కొంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖరాశారు. టీ.కాంగ్రెస్ లో తనపై కొందరు నాయకులు కక్షకట్టారంటూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి లేఖరాశారు జగ్గారెడ్డి. ఖలోని అంశాలను ప్రస్తావిస్తూ మూడు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుండి నేను కాంగ్రెస్ గుంపులో ఉండను అని జగ్గారెడ్డి అన్నారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్న జగ్గారెడ్డి.. పార్టీ వీడినా గాంధీ కుటుంబం పై గౌరవంతో ఉంటానని ఆయన అన్నారు.

Also read: TPCC : సార్.. ప్లీజ్ రాజీనామా చేయొద్దన్న నేత.. జగ్గారెడ్డి ఏమన్నారంటే

కాంగ్రెస్ లో సడన్ గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చని.. అలాగని తనపై నిందలు వేస్తె ఊరుకునేది లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తనపై కోవర్టుగా ముద్రవేస్తున్నారని..ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే పార్టీలో కోవర్ట్ అంటూ.. కొందరు నేతలు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ఉండేవని.. కానీ అప్పుడు నేతల్లో ఉన్న హుందా తనం ఇప్పుడు లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని జగ్గారెడ్డి అన్నారు.

Also read: Jagga Reddy : జగ్గారెడ్డికి బుజ్జగింపులు.. నిర్ణయంపై ఉత్కంఠ

పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని జగ్గారెడ్డి సూచించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభ నిర్వహించాలంటూ 2017లో ఇక్కడి నేతలను ఆదేశిస్తే.. సభ పెట్టడానికి పార్టీ నేతలు ముందుకురాని పక్షంలో తాను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించానని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ఆ నాటి నుండే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని.. పార్టీ కోసం కష్టపడిన నేనా కోవర్టుని? అంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. అభ్యర్థులను నిలబెట్టే విషయంలో పార్టీ నేతలు స్పందించని పక్షంలో మెదక్ జిల్లా నుండి తానే ఒక అబ్యర్దిని బరిలో దించి డబ్బు ఖర్చుచేసి కాంగ్రెస్ పరువు కాపాడానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ లో 40 వేలుగా ఉన్న కాంగ్రెస్ ఓట్లను.. ఇటీవల ఉప ఎన్నికల్లో మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్ళు.. కోవర్టులా? నేను కోవర్టునా? అనే విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానం గ్రహించాలని జగ్గారెడ్డి అన్నారు.

Also read: Telangana : ఫ్రంట్‌ ముచ్చట్లు, మహారాష్ట్రకు సీఎం కేసీఆర్