Jagga Reddy : జగ్గారెడ్డికి బుజ్జగింపులు.. నిర్ణయంపై ఉత్కంఠ

రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వడంతో.. రేసులో ఉన్న జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న..

Jagga Reddy : జగ్గారెడ్డికి బుజ్జగింపులు.. నిర్ణయంపై ఉత్కంఠ

Jaggareddy Vs Revanth

Updated On : February 19, 2022 / 11:08 AM IST

Telangana Congress Party : తెలంగాణ రాజకీయాల్లో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్‌పై కారాలు, మిరియాలు నూరుతున్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తానికి హ్యాండిస్తారా..? పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. పార్టీకి తన వల్ల ఇబ్బంది ఉంటే తన దారి తాను చూసుకుంటానని జగ్గారెడ్డి ప్రకటించడంతో.. అసలు ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డి.. 2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారం పార్టీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ఉదయం 11గంటలకు సంగారెడ్డిలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఆ వెంటనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో.. అనుచరులతో భేటీ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి పెరిగిపోతోంది.

Read More : MLA Jaggareddy : జగ్గారెడ్డి దగ్గరకు వెళుతా.. అసంతృప్తి నాయకులను పీసీసీ చీఫ్ కలవాలి – వీహెచ్

సీనియర్ల అలర్ట్ : –
దీంతో కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు అలర్ట్‌ అయ్యారు. జగ్గారెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు. మాజీ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వీ.హనుమంతరావు తదితరులు జగ్గారెడ్డి పార్టీని వీడకుండా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. అనుచరులతో సమావేశం తర్వాత.. రాజకీయ భవిష్యత్‌పై జగ్గారెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి పార్టీ మారబోతున్నారా.. లేక కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతారా.. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని శనివారం అధికారికంగా ప్రకటిస్తారా.. అనేది సస్పెన్స్‌గా మారింది.

Read More : Jagga Reddy: కాంగ్రెస్‌కి జగ్గారెడ్డి గుడ్ బై? నా వల్లే ప్రాబ్లమ్ ఐతే నేనెళ్లిపోతా!

పార్టీ మారుతారా ?  : –
రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వడంతో.. రేసులో ఉన్న జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే డమ్మీ పోస్ట్ అంటూ.. బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజునాడు కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే.. జగ్గారెడ్డి మాత్రం.. తన వైఖరికి భిన్నంగా స్పందించారు. ఆ తర్వాతి రోజే.. పార్టీకి తన వల్ల ఇబ్బంది ఉంటే తన దారి తాను చూసుకుంటానంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో.. పార్టీ మారతారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల అనుచరులతో వ్యాఖ్యానించారట. గుర్తింపు లేనిచోట పని చేయడం అవసరమా అంటూ కార్యకర్తలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

Read More : Sangareddy MLA : జగ్గారెడ్డి ఏం చెబుతారు ? పార్టీ కార్యకర్తలతో సమావేశం

కోవర్టుగా ముద్ర : –
మరోవైపు.. పార్టీ కోసం పని చేస్తుంటే.. కోవర్టుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందన్నది జగ్గారెడ్డి చేసే ఆరోపణ. ఇటీవలి కాలంలో.. సంగారెడ్డిలో, ఔటర్ రింగ్‌రోడ్‌పై పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌తో కాస్త సన్నిహితంగా మెలిగారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్ది జగ్గారెడ్డి అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే వాటిని ఖండించారు జగ్గారెడ్డి. తాను కేటీఆర్‌కి కోవర్టుని కాదని.. ఏదో సమావేశంలో కేటీఆర్‌ను కలిసినంత మాత్రాన.. తనను టీఆర్‌ఎస్‌కు సపోర్టర్‌ననే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో చాలా మంది కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ను కలిశారని గుర్తు చేశారు జగ్గారెడ్డి.