Telangana : ఫ్రంట్‌ ముచ్చట్లు, మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

ఉద్ధవ్‌ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబైకి వెళుతున్నారు సీఎం కేసీఆర్‌.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కేసీఆర్‌కు ఫోన్‌ చేసి ఆహ్వానించారు ఠాక్రే. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ చేస్తున్న...

Telangana : ఫ్రంట్‌ ముచ్చట్లు, మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

Kcr Uddhav

KCR And Thackeray : జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేంద్ర ప్రభుత్వంతో విబేధిస్తున్న అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఒక్కటి చేసేందుకు కంకణం కట్టుకున్న కేసీఆర్‌.. రాబోయే పార్లమెంట్ ఎన్నిక‌ల నాటికి జాతీయ స్థాయిలో ఎన్డీఏకు దీటుగా ప్రాంతీయ పార్టీల‌ను సిద్ధం ఏకం చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు రెడీ అయ్యారు. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యి కీలక చర్చలు జరపనున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రేతో లంచ్‌ మీటింగ్ నిర్వహించనన్నారు సీఎం కేసీఆర్‌. ఈ భేటీలో దేశ రాజకీయాలపై కీలక చర్చ జరగనుంది. ఇటీవలే పీపుల్స్ ఫ్రంట్‌ ఏర్పాటు కాబోతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఈ చర్చల్లో ఇదే ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యచరణపై చర్చలు జరుగనున్నట్టు తెలుస్తోంది.

Read More : CM KCR : ఈనెల 20న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ

ఉద్ధవ్‌ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబైకి వెళుతున్నారు సీఎం కేసీఆర్‌.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కేసీఆర్‌కు ఫోన్‌ చేసి ఆహ్వానించారు ఠాక్రే. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నానని కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్‌ ప్రదేశ్ ఎన్నిక‌లు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైన‌ల్స్‌గా రాజ‌కీయ పార్టీలు భావిస్తున్నాయి. యూపీ ఫ‌లితాల‌కు అనుగుణంగా రాబోయే రోజుల్లో జాతీయ రాజ‌కీయాల్లో వేగంగా ప‌రిణామాలు మారే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. యూపీలో బీజేపీ బ‌లం నిరూపించుకోకపోతే జాతీయ స్థాయిలో ప్రాంతీయ‌ పార్టీల హ‌వా పెరుగుతుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను ఎప్పటిక‌ప్పుడు అంచ‌నా వేస్తున్న కేసిఆర్ బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల మ‌ద్దతును కూడగ‌డితేనే బీజేపీకి షాక్ ఇవ్వొచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.