CM KCR : ఈనెల 20న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ

మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని సీఎం ఉద్ధవ్ సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు.

CM KCR : ఈనెల 20న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ

Kcr Uddhav

CM KCR-CM Uddhav Thackeray : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే, దేశం కోసం కేసీఆర్ చేస్తోన్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం సీఎం కేసీఆర్ చేస్తోన్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును పలికారు.

ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ ” కేసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం…” అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ” మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భం లో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం..” అని సీఎం కేసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు.

KCR Comments: జాతీయ రాజకీయాల్లో.. కేసీఆర్ వ్యాఖ్యల దుమారం..!

సీఎం కేసీఆర్ నెల రోజులు బిజీ బిజీగా కానున్నారు. నేషనల్ పాలిటిక్స్ పై దృష్టి సారించి ఢిల్లీ కోటను బద్దలు కొడతా, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానంటూ చెప్పడంతో పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా కేసీఆర్ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. పీపుల్స్ ఫ్రంట్ వస్తుందని అందులో తాను కీలక పాత్ర పోషిస్తానని చెబుతున్న కేసీఆర్.. మాజీ ప్రధాని దేవేగౌడ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశం కావావలని భావిస్తున్నారు. టీఎంసీ, డీఎంకే, శివసేన, జేడీఎస్ అధ్యక్షులతో సమావేశం అయ్యేందుకు ఆ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు ఆశిస్తూ కేసీఆర్, ఆ దిశగా చర్చలు జరుపనున్నారు. గత ఎన్నికల ముందే ఫెరడల్ ఫ్రంట్ పై ఆలోచన చేసేన కేసీఆర్, అప్పట్లో పలు ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలను కలిశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పుడు పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటులో బిజీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను, రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కొటిగా ఏకతాటిపైకి వస్తున్నాయి.

Mamata Banerjee: స్టాలిన్ , కేసీఆర్‎‎లకు మమతా ఫోన్ కాల్

కొంతకాలంగా క్రితం ప్రగతి భవన్ లో సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వీయాదవ్ కూడా కేసీఆర్ చర్చలు జరిపారు.  ఇటీవలే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్లు చేసి జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడారు కేసీఆర్. ముంబై రావాలని సీఎం ఉద్ధవ్.. కేసీఆర్ ను ఆహ్వానించారు.