మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్ దాష్ఠికం : అక్రమాలను ప్రశ్నించినందుకు యువకుడిపై దాడి

మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్ దాష్ఠికం : అక్రమాలను ప్రశ్నించినందుకు యువకుడిపై దాడి

Updated On : February 25, 2021 / 12:57 PM IST

Sarpanch attacks yougster : అక్రమాలు ప్రశ్నించాడనే కోపంతో ఓ యువకుడిపై ప్రజాప్రతినిధి దాడి చేశాడు. ప్రజలకు మంచి చేయాల్సిన గ్రామ సర్పంచ్‌… ఆ విషయాన్ని మరిచిపోయాడు. సోషల్‌ మీడియాలో అతని అక్రమాలు ప్రశ్నించిన వ్యక్తిని చితకబాదాడు. విషయం పోలీస్‌ స్టేషన్ వరకు వెళ్లడంతో చివరికి రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లికి చెందిన సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఉపాధి హామీ పథకం పనులను యంత్రాల ద్వారా చేస్తున్నాడని… గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌ అనే యువకుడు అడ్డుకున్నాడు. గ్రామ సరిహద్దుల్లో ప్రభుత్వ పనులకంటూ చెప్పి మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై సోషల్‌ మీడియాలో కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్‌… తన అనుచరులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్‌పై దాడి చేశాడు.

గతంలో కూడా తన అక్రమాలను ప్రశ్నించిన వారిపై అనుచరులతో దాడి చేశాడని సర్పంచ్‌ శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. దాడి విషయాన్ని జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్‌ గౌడ్ ఫిర్యాదు చేయడంతో… అధికార పార్టీ నేతలతో కలిసి రాజీకి సర్పంచ్‌ ప్రయత్నిస్తున్నాడు.