Vidyasagar Rao : దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ.. విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు

భారత్ కు రెండవ రాజధానిగా తెలంగాణ అయ్యే అవకాశం ఉంది, తెలంగాణ దేశానికి రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందంటూ మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు.

Vidyasagar Rao : దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ.. విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు

former Governor Vidyasagar Rao

Updated On : June 16, 2023 / 2:24 PM IST

Vidyasagar Rao – BJP  : బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ కు రెండవ రాజధానిగా తెలంగాణ అయ్యే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కరీంనగర్ (Karimnagar) లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికి రెండో రాజధాని (Second Capital of India) అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం (Constitution of India)లో ఈ అంశం ఉందని ఆయన వెల్లడించారు.

తెలంగాణ బీజేపీ (Telangana BJP)లో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఒకవేళ ఉంటే వాటి విషయం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. కాగా, దేశంలో మరోసారి బీజేపీ గెలిచి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు అదే కోరుకుంటున్నారని చెప్పారు.

కాగా గతంలో కూడా విద్యాసాగర్ రావు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులను చూస్తుంటే డా. బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని అని అన్నారు. తెలంగాణకు చెందిన చెన్నమనేని విద్యాసాగర్ రావు దివంగత ప్రధాని వాజ్ పేయ ప్రభుత్వంలో హోం మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర గవర్నర్ గానూ సేవలు అందించారు. పనిచేశారు.

Also Read: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. తలెత్తబోయే సమస్యలేంటి?