Jagtial Mystery : జగిత్యాలలో కలకలం.. అక్క అనుమానాస్పద మృతి, చెల్లి అదృశ్యం.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

ఇద్దరూ కలిసి నిజామాబాద్ బస్సు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గొడవలో దీప్తి చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. Jagtial - Suspicious Death

Jagtial Mystery : జగిత్యాలలో కలకలం.. అక్క అనుమానాస్పద మృతి, చెల్లి అదృశ్యం.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

Jagtial - Suspicious Death

Updated On : August 29, 2023 / 11:46 PM IST

Jagtial – Suspicious Death : జగిత్యాల జిల్లాలో ఓ యువతి అనుమానాస్పద మృతి, ఆమె చెల్లి మిస్సింగ్ మిస్టరీగా మారింది. కోరుట్ల భీమునిదుబ్బలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దీప్తి తన చెల్లితో కలిసి రాత్రి ఇంట్లోనే ఉంది. వారి తల్లిదండ్రులు ఓ గృహప్రవేశం ఫంక్షన్ కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే, దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె చెల్లి ఇంటికి గడియపెట్టి వెళ్లిపోయింది.

బస్టాండ్ లో ఓ యువకుడితో ఆమె కలిసి ఉన్నట్లు సీసీటీవీ కెమెరాలో గుర్తించారు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ బస్సు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. అక్కాచెల్లెలి మధ్య గొడవలో దీప్తి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.(Jagtial)

Also Read.. Hyderabad : ఘరానా మోసం.. ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌తో డబ్బు దోచేస్తున్న కేటుగాళ్లు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆ డాక్యుమెంట్స్ సేకరించి..

దీప్తి అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, దీప్తి చెల్లి అదృశ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు పడ్డారు. దీప్తి ఎలా చనిపోయింది? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలియాల్సి ఉంది. నిన్న(ఆగస్టు 28) రాత్రి 11 గంటల వరకు దీప్తి తన తండ్రితో ఫోన్ లో మాట్లాడింది. ఆ తర్వాత దీప్తి ఎలా చనిపోయింది? అనేది ఆమె చెల్లికి మాత్రమే తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.(Jagtial Mystery)

తెల్లవారుజామున 5గంటల తర్వాత చెల్లి చందన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా కోరుట్ల బస్టాండ్ లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. చందన మరో యువకుడితో మాట్లాడటం, ఇద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్లినట్లుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. దీప్తి అసలు ఎలా చనిపోయింది? మృతికి కారణాలు ఏంటి? అనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు పోలీసులు. టెక్నాలజీ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం చందన మిస్సింగ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. చందన ఎక్కడ ఉంది? ఎవరితో వెళ్లింది? అనేది తెలియాల్సి ఉంది.(Jagtial)

ఓవైపు దీప్తి మరణం, మరోవైపు ఆమె చెల్లి చందన అదృశ్యం. ఈ ఘటనలతో దీప్తి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. దీప్తి మరణంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు చందన గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Also Read..Bengal: 8వ తరగతి విద్యార్థి కిడ్నాప్, హత్య.. తోటి పిల్లలే నిందితులు

మృతురాలు దీప్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని తెలుస్తోంది. దీప్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి.. ఉదయాన దీప్తికి ఫోన్ చేశాడు. కానీ, దీప్తి ఫోన్ ఎత్తలేదు. వెంటనే ఆయన చిన్నకూతురు చందనకు ఫోన్ చేయగా, చందన ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. దాంతో మధ్యాహ్నం తన స్నేహితుడికి ఫోన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి.. ఇంటికి వెళ్లి చూడమని చెప్పాడు. శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లే అతడి స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి చూడగా అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఇంట్లో సోఫా మీద దీప్తి మృతదేహం కనిపించింది.(Jagtial)

అదే సమయంలో చందన కనిపించకుండా పోయింది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు చందన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. దీప్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తోంది. ఆమె తమ్ముడు కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీరే. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు.