హైదరాబాద్ ఎస్పీఆర్ హిల్స్‌లో అస్థిపంజరం..సాయిబాబా గుడి సెల్లార్ లో వెలుగులోకి

Skeleton disturbance in Hyderabad : హైదరాబాద్ ఎస్‌ఆర్ గనర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్‌లో బయటపడిన అస్థిపంజరం కలకలం సృష్టిస్తోంది. ఎస్పీఆర్ హిల్స్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇనుపెట్టలో బయటపడిన అస్థిపంజరం పూర్తిగా పాడైపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలగులోకి వస్తున్నాయి.
2017లో సాయిబాబా గుడి సెల్లార్‌ను పాల్ అద్దెకు తీసుకున్నారు. వచ్చిన అద్దెను ఆలయ నిర్వాహకులు పూజారికి జీతంగా ఇస్తున్నారు. పన్నెండు నెలలుగా పాల్ అద్దె చెల్లించలేదు. సెల్లార్‌లో దుర్వాసన రావడంతో సాయిబాబా గుడి అర్చకుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సెల్లార్‌లోని షాపును తెరిచి పరిశీలించారు.
ఇనుపెట్టెలో బయటపడిన అస్థిపంజరం 30 ఏళ్ల వయసు పైబడిన పురుషునిదిగా గుర్తించారు. పాల్ అచూకీ కోసం గాలిస్తున్నారు. పాల్ దొరికితే ఈ కేసు పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి. పాల్ ఎవరినైనా హత్య చేసి శవాన్ని సెల్లార్‌లోని ఇనుపెట్టలో పెట్టి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాల్ దొరికితే ఈ కేసు మిస్టరీ వీడుతుంది.