Sampath Kumar : అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్.. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ దాడులు

ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో హంగామా చేసిన అధికారుల దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు.

Sampath Kumar House Raids : జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు దాడులు నిర్వహించారు. అడ్డుకోబోయిన వారిని నెట్టేసి సంపత్ కుమార్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోలోకి దూసుకెళ్లి హల్ చల్ చేశారు. ఇంట్లోని వస్తువులు, బట్టలు, సామాగ్రిని చిందరవందరగా పడేశారు.  వచ్చిన వారిని సెర్చ్ వారెంట్ చూపాలని సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మీ వారిని నిలదీశారు.

దీంతో సంపత్ కుమార్ సతీమణికి, వచ్చిన వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో సంపత్ కుమార్ సతీమణి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటినా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వచ్చిన వారిని నిర్బంధించేందుకు సంతప్ కుమార్ అనుయాయులు ప్రయత్నించారు. ఆయన అనుయాయులు నిలదీయడంతో పరార్ అయ్యారు.

Telangana Assembly Election 2023 : ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం

ఈ ఘటనపై సంపత్ కుమార్ ఆరా తీశారు. ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో హంగామా చేసిన అధికారుల దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు. అధికారులైతే ఎందుకు పారి పోయారని ప్రశ్నించారు.

అలంపూర్ లో కాంగ్రెస్ గెలుస్తుందని జీర్ణించుకోలేకే అధికార పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించారు. ఇది ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అనుయాయుల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సంతప్ కుమార్ డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు