పాతబస్తీలో భారీగా గంజాయి పట్టివేత.. మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్స్ కలకలం

పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయిని గుర్తించారు. రూ.5లక్షల విలువచేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది.

పాతబస్తీలో భారీగా గంజాయి పట్టివేత.. మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్స్ కలకలం

Heavy marijuana

Old City : పాతబస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయిని గుర్తించారు. రూ.5లక్షల విలువచేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. ఇద్దరు మహిళలను అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు. వారి వద్దనుండి గంజాయి, ఓ కారు, రెండు మోటర్ సైకిళ్లతో పాటు రెండు మొబైల్స్ సీజ్ చేశారు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి లేడీ కిలాడీలు విద్యార్ధులకు విక్రయిస్తున్నట్లుగా ఎస్వోటీ అధికారులు గుర్తించారు. నిందితులు శరీష, పద్మతోపాటు శ్రీనివాస్ చారిలపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చత్రినాక పోలీసులు తెలిపారు.

Also Read : మీ భార్యలు వేసుకునే భారతీయ చీరలను తగులబెట్టండి: ఆందోళనకారులకు గట్టిగా బుద్ధిచెప్పిన బంగ్లాదేశ్ ప్రధాని

మొయినాబాద్‌లో..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్స్ కలకలం సృష్టించాయి. 92 గంజాయి చాక్లెట్స్ ను రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందం సీజ్ చేసింది. తోల్ కట్టా వద్ద ఓ షెడ్డుపై ఎస్వోటీ అధికారుల బృందం దాడి చేసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న సౌరబ్ యాదవ్ ను ఎస్వోటీ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముస్తబా అలీఖాన్ అనే పాత నేరస్థుడు అరెస్ట్ కాగా.. సౌరబ్ ఖాన్ తో పాటు ఇద్దరిని అరెస్ట్ అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.