Vande Bharat Express
South Central Railway: దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల మధ్య కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లను నడుపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వీటిని ప్రారంభించారు. అయితే, ఆయా ప్రాంతాల్లో ఈ రైళ్లపై ఆకతాయిలు రాళ్ల దాడులు (Stone attacks) చేస్తున్నారు. ఈ క్రమంలో రైళ్లు దెబ్బతినడంతో పాటు ప్రయాణికులు గాయపడుతున్నారు. దాడులకు పాల్పడిన వారిని రైల్వే పోలీసులు (Railway Police) అదుపులోకి తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వందే భారత్ రైళ్లపై ఆకతాయిలు రాళ్ల దాడిచేస్తున్నారు.
Railway Station: ఛీ.. ఛీ..! రైల్వే స్టేషన్‌లో కళ్లు మూసుకున్న ప్రయాణీకులు.. మూడు నిమిషాలు రచ్చరచ్చ..
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లతో పాటు ఇతర రైళ్లపై దాడులకు పాల్పడిన వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జనవరి నుంచి ఇప్పటి వరకు రైళ్లపై రాళ్లదాడికి పాల్నడిన 39 మందిని అరెస్టు చేసి జైలుకు పంపామని పేర్కొంది. ఈ దాడుల్లో అయిదుగురు ప్రయాణీకులు గాయపడినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Indian Railways: రైలులో పెంపుడు కుక్కతో ప్రయాణం.. రైల్వే మంత్రి ఏమంటున్నారంటే
రైళ్లపై రాళ్లదాడికి పాల్పడుతున్న ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఎవరైన రైళ్లపై రాళ్లు విసరడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని, ప్రయాణీకులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.