Indian Railways: రైలులో పెంపుడు కుక్కతో ప్రయాణం.. రైల్వే మంత్రి ఏమంటున్నారంటే

రైళ్లలో కుక్కలు లేదా ఇతర పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లాలంటే వాటిని ప్రత్యేక కంపార్టుమెంట్లలోని బోన్లలో ఉంచి లాక్ చేయాలి. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని రైల్వే శాఖ అంచనా. కానీ, ఎంతో ఇష్టంగా చూసుకునే వాటిని బోన్లలో ఉంచి, లాక్ చేయడానికి చాలా మంది యజమానులు ఇష్టపడటం లేదు.

Indian Railways: రైలులో పెంపుడు కుక్కతో ప్రయాణం.. రైల్వే మంత్రి ఏమంటున్నారంటే

Indian Railways: పెంపుడు కుక్కల యజమానులకు ఎంత ఇష్టమైనా, వాటిని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుల్లో తీసుకెళ్లడం కష్టమైన పని. బస్సులు, రైళ్లలో తీసుకెళ్లేందుకు నిబంధనలు అంగీకరించవు. తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బందే. అయితే, రైల్వే శాఖ మాత్రం ముందస్తు అనుమతితో కొన్ని రైళ్లలో ప్రత్యేక కంపార్టుమెంట్లలో వాటిని తీసుకెళ్లేందుకు అనుమతిస్తోంది.

Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?

రైళ్లలో కుక్కలు లేదా ఇతర పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లాలంటే వాటిని ప్రత్యేక కంపార్టుమెంట్లలోని బోన్లలో ఉంచి లాక్ చేయాలి. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని రైల్వే శాఖ అంచనా. కానీ, ఎంతో ఇష్టంగా చూసుకునే వాటిని బోన్లలో ఉంచి, లాక్ చేయడానికి చాలా మంది యజమానులు ఇష్టపడటం లేదు. దీంతో జంతు ప్రేమికులు, పెంపుడు జీవుల యజమానుల నుంచి వచ్చిన వినతి మేరకు రైల్వే శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. వాటి కోసం మరిన్ని ప్రత్యేక నిర్మాణాలు చేసింది. దీని ప్రకారం.. యజమానులు తమ పెంపుడు జీవుల్ని తమతోపాటు కంపార్టుమెంట్లలో తీసుకెళ్లొచ్చు. అంతేకాదు.. అవి పడుకోవడానికి కూడా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

China President : రష్యా పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ .. యుక్రెయిన్‌కు శుభవార్త వస్తుందా?

తమ పెంపుడు కుక్కతో కలిసి నిద్రించేలా బెడ్లను తీర్చిదిద్దారు. దీంతో ప్యాసింజర్లు తమ పెంపుడు కుక్కలతో హాయిగా నిద్రపోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రీ ట్వీట్ చేశారు. భారతీయ రైల్వేలు 24×7 సేవలు అందిస్తాయంటూ ఆయన ట్వీట్ చేశారు. అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన వీడియోలో.. ప్రయాణిస్తున్న రైలులో ఒక మహిళ నిద్రపోతుంటుంది. బెడ్ షీట్ కప్పుకొని నిద్రపోతున్న ఆమెను ఒక వ్యక్తి తట్టిలేపుతాడు. అప్పుడు ఆమె బెడ్ షీట్ తీసేసరికి లోపల ఆమె పెంపుడు కుక్క కూడా నిద్రలేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లు కూడా ఆకర్షిస్తోంది. రైల్వేలో తీసుకొచ్చిన మార్పులకు ఈ వీడియో అద్దం పడుతోంది.