Bouncers Over Action : అడ్డొస్తే అడ్డంగా నెట్టిపడేస్తారు. ప్రశ్నిస్తే పక్కకు విసిరి పారేస్తారు. వీఐపీపై ఈగ వాలినా ఊరుకోరు. పోలీసులు, పబ్లిక్ జాన్తా నై. ఎవరైతే మాకేంటి? మా వీఐపీలే మాకు దేవుడు. ఆయనను టచ్ చేసే సాహసం కాదు కదా.. కనీసం దగ్గరికి వచ్చే ధైర్యం చేసినా ఊరుకోము.. ప్రస్తుతం ఇలాగే ఉంది బౌన్సర్ల తీరు. స్టార్స్, సెలబ్రిటీస్ కు రక్షణ కవచంలా ఉండాల్సిన వాళ్లు ఓవరాక్షన్ తో విమర్శల పాలవుతున్నారు. సంధ్య థియేటర్ ఘటన, మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూలో బౌన్సర్లు హద్దు మీరిన తీరును తప్పు పడుతున్నారంతా. ఇంతకీ బౌన్సర్ల చుట్టూ వివాదాలు ముసురుకోవడానికి కారణం ఏంటి?
బౌన్సర్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు?
ఇంతకీ ప్రైవేట్ సెక్యూరిటీగా బౌన్సర్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు? బౌన్సర్లు లేదా ప్రైవేట్ బాడీగార్డుల నియామకంలో రూల్స్ ఏమైనా ఉన్నాయా? అవి ప్రైవేట్ ఏజెన్సీలు ఫాలో అవుతున్నాయా? ఈ వివాదాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? సంధ్య థియేటర్ ఘటన, మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల ఇష్యూ ఏం నేర్పుతోంది?
Also Read : మేము అధికారపక్షం కాదు ప్రతిపక్షం కాదు, ఆ రెండు కూటములకు దూరం- విజయసాయిరెడ్డి
బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీ..
బౌన్సర్లంటే క్లబ్ లు, పబ్ లు వంటి ప్రదేశాల్లో ఎంట్రన్ దగ్గర నిల్చుని సెక్యూరిటీ అందించే ప్రైవేట్ సిబ్బంది. లోపలికి వెళ్లకూడని వ్యక్తులని, ఘర్షణలకు కారణమయ్యే వారిని అడ్డుకుని బయటకు పంపించడానికి ఉపయోగపడే ప్రైవేట్ సెక్యూరిటీ. రాజ్యాంగపరంగా, చట్టబద్దంగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ ఉంటుంది. వారికి కావాల్సిన సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ, సమాజంలో కాస్త హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రైవేట్ గా బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీని నియమించుకుంటూ ఉంటారు.
Bouncers (Photo Credit : Google)
వీఐపీలకు ముప్పు రాకుండా చూసుకుంటారు..
వీఐపీలకు ప్రొటెక్షన్ సరిపోని సమయంలో ఎక్కువ భద్రత కావాలనుకున్నప్పుడు పోలీసులు ప్రభుత్వ అనుమతితో ప్రైవేట్ ఎస్కార్ట్స్ నియమించుకుంటారు. సున్నితమైన, సమస్యాత్మకమైన రద్దీ ప్రాంతాల్లో వీఐపీలకు భద్రత కల్పించేందుకు ప్రైవేట్, వ్యక్తిగత సెక్యూరిటీ బౌన్సర్లను చాలా ఏజెన్సీలు నియమిస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు బయట తిరుగుతున్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీగా, బాడీగార్డులుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా బౌన్సర్లనే వినియోగిస్తున్నారు. రద్దీ ఎక్కువ ఉండే కార్యక్రమాల్లో వీఐపీలకు ముప్పు రాకుండా వీళ్లు నియంత్రిస్తుంటారు.
Bouncers Controversy (Photo Credit : Google)
ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పించే వాళ్లను బాడీగార్డ్స్ లేదా వీఐపీ ఎస్కార్ట్స్ అని పిలవాలి. కానీ, ఇప్పుడు వీరిని కూడా బౌన్సర్లుగానే పిలుస్తున్నారు. నిజానికి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ పస్రా యాక్ట్ -2005 కింద పని చేయాలి. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంది. బాడీగార్డులను నియమించుకోవాలంటే ఏజెన్సీలకు కచ్చితంగా పస్రా లైసెన్స్ ఉండాలి.
పూర్తి వివరాలు..
Also Read : 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి