మరీ ఇంత మోసమా.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేసిన దారుణం.. లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుని కూడా..

సంతానం కోసం ఐవీఎఫ్​ సెంటర్లకు వచ్చే దంపతులను ఈ ఐవీఎఫ్ సెంటర్లు మోసం చేస్తున్నాయి. పేద కుటుంబాల నుంచి పిల్లలను కొని, కొన్ని ప్రాంతాల నుంచి శిశువులను అపహరించి ఆ ముఠా ఈ దందాను కొనసాగిస్తోంది.

మరీ ఇంత మోసమా.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేసిన దారుణం.. లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుని కూడా..

Updated On : July 30, 2025 / 10:39 AM IST

సృష్టి IVF సెంటర్‌లో జరిగిన అక్రమాలపై జరుగుతోన్న దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడిన విషయం తెలిసిందే. తీగలాగితే డొంక కదిలినట్లు దేశంలోని పలు రాష్ట్రాల్లోని ఇటువంటి ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా, నిషేధిత IVF కేంద్రాల నెట్‌వర్క్ కార్యకలాపాలు బయటపడుతున్నాయి.

ఈ ముఠాలు పసిపిల్లలను కిడ్నాప్ చేయడం లేదా కొనుగోలు చేసి కోట్ల రూపాయల‌కు అమ్ముతూ, వారిని సరోగసీ ద్వారా జన్మించిన వారిగా తప్పుడు ప్రకటనలు ఇచ్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

అక్రమంగా డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు ఉన్న ముఠా సభ్యులతో కూడిన బలమైన నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న IVF కేంద్రాల ద్వారా వీరు సమన్వయంతో పని చేస్తూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పిల్లలను తరలించి, దంపతులకు అప్పగిస్తున్నారు.

సంతానం కోసం ఐవీఎఫ్​ సెంటర్లకు వచ్చే దంపతులను ఈ ఐవీఎఫ్ సెంటర్లు మోసం చేస్తున్నాయి. పేద కుటుంబాల నుంచి పిల్లలను కొని, కొన్ని ప్రాంతాల నుంచి శిశువులను అపహరించి ఆ ముఠా ఈ దందాను కొనసాగిస్తోంది. పిల్లల కోసం వచ్చేవారిని ఏమార్చి ఈ శిశువులను వారికి అప్పజెపుతున్నారు.

Also Read: నకిలీ బ్యాంక్‌.. రూ.140 కోట్ల మోసం.. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఇలా..

శిశు అక్రమ రవాణా ముఠా కొనుగోలు చేసిన, కిడ్నాప్ చేసిన శిశువులను తీసుకొచ్చి ఐవీఎఫ్‌ సెంటర్లు సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా చూపెడుతున్నాయి. దంపతుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకుంటున్నాయి. నకిలీ పత్రాలను కూడా సృష్టిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లోని సిబ్బందికి డబ్బు ఆశను చూపెడుతూ శిశువులను అపహరించేలా చేస్తున్నాయి.

అనారోగ్య సమస్యలతో జన్మించిన శిశువులను, ఆడపిల్ల పుట్టిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసే తల్లిదండ్రులను కూడా లక్ష్యంగా చేసుకుని వారి నుంచి శిశువులను తీసుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు అనాథ శరణాలయాల్లోని కొందరు సిబ్బందితో కలిసి పిల్లలను అక్రమంగా కొంటున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌‌లోని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు ఇటువంటి చర్యలకు పాల్పడ్డట్లు తెలిసింది. దర్యాప్తు భాగంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీలాంటి పలు రాష్ట్రాల్లో శిశువుల అక్రమ రవాణా ముఠాకు సంబంధాలున్నట్లు పోలీసులకు ప్రాథమికంగా ఆధారాలు లభించాయి. చైన్​సిస్టమ్‌‌గా ఏర్పడిన ముఠాలోని సభ్యులు వేర్వేరు రాష్ట్రాల్లో పిల్లలను సేకరిస్తున్నారు.

ఆ శిశువులను మరొక రాష్ట్రంలో అమ్ముతూ ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటున్నారు. పేద కుటుంబాల నుంచి శిశువులను కొనేందుకు రూ.50 వేల లోపే ఖర్చు చేస్తున్నారు. నిరుపేదలతో మాట్లాడి ఒప్పించినందుకు ఆసుపత్రుల సిబ్బందికి ఇచ్చే కమిషన్ కూడా ఆ రూ.50 వేలలోనే తీసుకోవాల్సి ఉంటుంది.