Kunamneni Sambashivarao : కాంగ్రెస్, సీపీఐ పొత్తు చర్చలు అవాస్తవం… సీపీఎంతో కలిసి పోటీ : కూనంనేని

మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాక కమ్యూనిస్టుల వల్లే గెలిచామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు క్రమంగా కమ్యూనిస్టులను దూరం పెడుతూవచ్చారు. సీపీఐ, సీపీఎం అడిగిన స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ విముఖత వ్యక్తం చేసింది.

Kunamneni Sambashivarao : కాంగ్రెస్, సీపీఐ పొత్తు చర్చలు అవాస్తవం… సీపీఎంతో కలిసి పోటీ : కూనంనేని

Kunamneni Sambashivarao

Updated On : August 27, 2023 / 2:07 PM IST

CPI Kunamneni Sambashivarao : కాంగ్రెస్, సీపీఐ పొత్తు చర్చలు అవాస్తమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎవరూ తమతో మాట్లాడ లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని పేర్కొన్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సీపీఐ, సీపీఎం బీఆర్ఎస్ కు మద్దుతు ఇచ్చాయి. ఆ మేరకు రెండు పార్టీల క్యాడర్, అభిమానులు బీఆర్ఎస్ కు ఓటేశారు.

ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తు ఉంటుందని భావించారు. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐ చెరో మూడు స్థానాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం సాగింది. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాక కమ్యూనిస్టుల వల్లే గెలిచామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు క్రమంగా కమ్యూనిస్టులను దూరం పెడుతూవచ్చారు. సీపీఐ, సీపీఎం అడిగిన స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ విముఖత వ్యక్తం చేసింది.

Bandi Sanjay : కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు ఇస్తున్నారు.. గెలిచాక వారు బీఆర్ఎస్ లో చేరతారు : బండి సంజయ్

అంతేకాకుండా ఇటీవల సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. సీపీఐ, సీపీఎం అడిగిన స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం మధ్య ఎన్నికల పొత్తు, మద్దతు ఉండదని స్పష్టం అయింది. ఈ క్రమంలో వారు కలిసి పోటీ చేసేందుకు, పరస్పరం మద్దతు ఇచ్చుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.

మరోవైపు కామ్రేడ్స్ తో పొత్తుల కోసం కాంగ్రెస్ చర్చలకు సిద్ధమవుతోంది. వామపక్ష నేతలకు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేశారు. సీపీఐ నేతలను ఠాక్రే ఆహ్వానించారు. అయితే, సీట్ల అంశం తేలితేనే పొత్తుపై ముందుకెళ్తామని కామ్రేడ్స్ అంటున్నారు. పాలేరు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, దేవకరొండ స్థానాల కోసం వామపక్షాలు పట్టుబట్టాయి.