Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన తమిళిసై

ఈ మధ్యే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ కు సయోధ్య కుదిరిందని ప్రచారం జరిగింది. ఇంతలోనే మళ్లీ వివాదం..

Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన తమిళిసై

Tamilisai Soundararajan

Updated On : September 25, 2023 / 3:19 PM IST

Tamilisai Soundararajan – MLCs: నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ(Kurra Satyanarayana)ను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.

దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకి ఆర్టికల్‌ 171 (5) కింద అర్హత లేదని వివరించారు. అలాగే, ఆ పదవులకు వారిని ఎంపిక చేయడానికి తగిన సమాచారం తనకు సమర్పించలేదని అన్నారు. కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని చెప్పారు. ఆయన సామాజిక సేవలో చురుకుగా ఉన్నట్లు ఆధారాలను తనకు సమర్పించలేదని తెలిపారు.

ఈ మధ్యే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ కు సయోధ్య కుదిరిందని ప్రచారం జరిగింది. ఇంతలోనే మళ్లీ వివాదం రాజుకోవడం గమనార్హం. గతంలో హుజురాబాద్ నేత కౌశిక్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సమయంలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఆయనను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై తమిళిసై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ… సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇతర రంగాల్లో కృషి చేసిన వారినే నామినేట్ చేయాలని చెప్పారు. అప్పట్లో చాలా కాలం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి అంశం పెండింగ్ లో ఉంది. ఇప్పుడూ అటువంటి ఘటనే చోటుచేసుకుంటోంది.

Harish Rao : దేశానికి ఆదర్శంగా తెలంగాణ వైద్య రంగం : మంత్రి హరీష్ రావు