TDP L Ramana : తెలంగాణ భవన్‌‌కు ఎల్.రమణ

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 2021, జూలై 12వ తేదీ సోమవారం ఉదయం తెలంగాణ భవన్ కు ఆయన రానున్నారు. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు.

TDP L Ramana : తెలంగాణ భవన్‌‌కు ఎల్.రమణ

L.ramana (1)

Updated On : July 12, 2021 / 6:20 AM IST

TDP L Ramana : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్.రమణ త్వరలోనే టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 2021, జూలై 12వ తేదీ సోమవారం ఉదయం తెలంగాణ భవన్ కు ఆయన రానున్నారు. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

ఎల్.రమణతో పాటు..ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోనున్నారు. 2021, జూలై 16వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో ఎల్.రమణ లాంఛనంగా చేరనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లేదా..కరీంనగర్ లో బహిరంగసభ నిర్వహించనున్నారని సమాచారం. ఇటీవలే ఎల్.రమణ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. రమణ రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడనుంది. ఇందులో ఒకటి ఎల్. రమణకు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

 

Read More : Virgin Galactic Space: అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగమ్మాయి శిరీష.. అక్కడ ఎంతసేపు ఉన్నారంటే?