Virgin Galactic Space: అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగమ్మాయి శిరీష.. అక్కడ ఎంతసేపు ఉన్నారంటే?

మెరికన్ స్పేస్‌క్రాఫ్ట్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ యజమాని బిలియనీర్ రిచర్డ్ బ్రెన్సన్ ఆదివారం రాత్రి 8 గంటలకు తన బృందంతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు.

Virgin Galactic Space: అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగమ్మాయి శిరీష.. అక్కడ ఎంతసేపు ఉన్నారంటే?

Sireesha

Virgin Galactic space flight: అమెరికన్ స్పేస్‌క్రాఫ్ట్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ యజమాని బిలియనీర్ రిచర్డ్ బ్రెన్సన్ ఆదివారం రాత్రి 8 గంటలకు తన బృందంతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాల గురించి కలలు కంటున్న బ్రెన్‌సన్‌కు ఇది పెద్ద సక్సెస్. బ్రిటిష్ బ్రెన్సన్‌తో సహా ఆరుగురు ప్రయాణికులు ఈ ట్రిప్‌లో ఉన్నారు.

ఈ చారిత్రాత్మక విమానంలో బ్రెన్సన్, అతని ముగ్గురు సిబ్బంది మరియు ఇద్దరు పైలట్లు ఉన్నారు. VMS యూనిటీ ఇంజిన్ VSS యూనిటీ-22 (బ్రెన్సన్ తల్లి పేరు పెట్టారు) రాకెట్ 50,000 అడుగుల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చింది. ఇందులో రిచర్డ్ బ్రెన్సన్‌తో పాటు మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్‌ ఉన్నారు. వీరందరితో పాటే తెలుగమ్మాయి శిరీష కూడా ఉన్నారు.

ఈ మొత్తం ప్రయాణం సుమారు 56 నిమిషాలు పట్టింది. వీరంతా నాలుగు నిమిషాలు మాత్రమే అంతరిక్షంలో ఉన్నాడు. భారత కాలమానం ప్రకారం.. విమానం ఎనిమిది గంటలకు బయలుదేరగా.. 9.11 గంటలకు తిరిగి భూమి మీదకి వచ్చారు.

భూమికి తిరిగి వచ్చిన తరువాత, రిచర్డ్ బ్రెన్సన్‌ వర్జిన్ గెలాక్సీ అంతరిక్ష నౌకలో ప్రయాణించడం మంచి అనుభూతిని ఇచ్చినట్లు చెప్పారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత, బ్రెన్సన్‌ త అంతరిక్షంలోకి వెళ్లడం చాలా గొప్పగా అనిపించింది అని అన్నారు.


ఇదే సమయంలో భారత్‌ నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర సృష్టించారు. అంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, భారత మూలాలు ఉన్న అమెరికన్ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లొచ్చారు.