Union Budget 2026 : పాత పన్ను vs కొత్త పన్ను.. మీ జీతానికి ఏ పన్నువిధానం బెటర్? టాక్స్ పేయర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటి?

Union Budget 2026 : పన్నుచెల్లింపుదారులు పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? ఇందులో ఏది వ్యక్తిగత ఆదాయాన్ని పొందేవారికి ప్రయోజనాలు ఉంటాయంటే?

Union Budget 2026 : పాత పన్ను vs కొత్త పన్ను.. మీ జీతానికి ఏ పన్నువిధానం బెటర్? టాక్స్ పేయర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటి?

Union Budget 2026 (Image Credit To Original Source)

Updated On : January 19, 2026 / 8:20 PM IST
  • ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రకటన
  • పాత పన్ను బెటరా? కొత్త పన్ను విధానం బెటరా?
  • టాక్స్ పేయర్లకు ఏది ఎంచుకుంటే ప్రయోజనాలెక్కువా?
  • వ్యక్తిగత ఆదాయం పొందేవారికి లాభామా? నష్టామా?

Union Budget 2026 : అందరి చూపు బడ్జెట్ వైపే..పన్నుచెల్లింపుదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కు సంబంధించి అనేక కీలక ప్రకటనలు చేయనున్నారు. ముఖ్యంగా పన్నుచెల్లింపుదారులకు సంబంధించి ఎలాంటి మినహాయింపులు, తగ్గింపులు ఉంటాయా? అనేది ఆసక్తి నెలకొంది.

అందులోనూ టాక్స్ పేయర్లలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. పాత పన్ను విధానం రద్దు చేస్తారా? లేదా కొత్త పన్ను విధానామే అమల్లో ఉంటుందా? అసలు ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? పాత పన్ను విధానంతో కలిగే ప్రయోజనాలేంటి? కొత్త పన్ను విధానంలో కలిగే ప్రయోజనాలేంటి? అనేది గందరగోళం నెలకొంది.

ప్రస్తుతం పన్నుచెల్లింపుదారులకు రెండు రకాల పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. అందులో ఒకటి పాత పన్ను విధానం.. మరొకటి కొత్త పన్ను విధానం.. ఈ రెండింటిలో ఏది కావాలంటే అది ఎంచుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి ఈ పన్ను విధానాల్లో ఏది బెటర్? అనేది తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం..

పాత పన్ను విధానంతో ప్రయోజనాలేంటి? :
ఒక్క మాటలో చెప్పాలంటే.. పాత పన్ను విధానంలో అనేక రాయితీలు, మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు మినహాయింపు అందిస్తోంది. అలాగే, హోం లోన్ల వడ్డీపై కూడా సెక్షన్ 24(B)కింద రాయితీని అందిస్తోంది.

ఆరోగ్య బీమా ప్రీమియం (80D), HRA, LTA వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా లోన్లు ఎక్కువగా తీసుకునే వారు, పెట్టుబడులు అధిక మొత్తంలో పెట్టేవారికి ఈ పాత పన్ను విధానం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

Union Budget 2026

Union Budget 2026 (Image Credit To Original Source)

కొత్త పన్ను విధానం ఎంచుకుంటే? :
అదే కొత్త పన్ను విధానం విషయానికి వస్తే.. చాలా ఈజీగా ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్దగా పేపర్ వర్క్ ఉండదు. కానీ, పాత పన్ను విధానంతో పోలిస్తే.. ఈ కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబులు తక్కువ ఉంటాయి.

అలాగే ఎక్కువ మినహాయింపులు, డిడక్షన్లు కూడా ఎత్తేశారు. జీతం ద్వారా ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులు, వ్యక్తిగత ఆదాయం పొందే వారికి మాత్రం ఈ కొత్త పన్ను విధానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also : Union Budget 2026 : టాక్స్ పేయర్లకు అలర్ట్.. పన్ను విధానం, HRA నుంచి 80C వరకు.. 2025 కొత్త ఆదాయపు పన్ను చట్టంలో రాబోయే ప్రధాన మార్పులివే..!

ఎవరికి ఏ పన్ను విధానం మంచిదంటే? :

ప్రతి ఆర్థిక సంవత్సరంలో పన్నుచెల్లింపుదారులు పాత పన్ను లేదా కొత్త పన్ను విధానంలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. ప్రత్యేకించి జీతం ఆదాయంగా పొందేవారు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఆయా ఏడాదిలో మార్చుకునే వెసులుబాటు ఉంది.

అదే బిజినెస్ పరంగా ఆదాయం పొందే వారు ఈ కొత్త విధానం ఎంచుకుంటే మాత్రం కొన్ని షరతులు వర్తిస్తాయి. అంటే వ్యాపార పరంగా ఆదాయంగా ఉంటే షరతులతోనే పాత పన్ను విధానంలోకి మారాల్సి ఉంటుంది.

ఏదిఏమైనా రాయితీలు, పెట్టుబడులు ఎక్కువగా ఆశించే వాళ్లు పాత పన్ను విధానం ఎంచుకోవడమే బెటర్.. అలాగే, సింపుల్ పన్ను నిర్మాణం ఆశించే పన్నుచెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడమే బెటర్ అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆదాయంతో పాటు ఖర్చులు, పెట్టుబడుల ఆధారంగా సరైన పన్ను విధానం ఎంచుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.