DGP Ramachandra Rao: ఆఫీస్‌లోనే డీజీపీ రాసలీలలు..? వీడియో వైరల్.. సీఎం సీరియస్

ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీంతో సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు.

DGP Ramachandra Rao: ఆఫీస్‌లోనే డీజీపీ రాసలీలలు..? వీడియో వైరల్.. సీఎం సీరియస్

DGP Ramachandra Rao Representative Image (Image Credit To Original Source)

Updated On : January 19, 2026 / 7:58 PM IST
  • వివాదంలో డీజీపీ ర్యాంక్ ఐపీఎస్
  • ఆఫీస్ లోనే మహిళలతో రాసలీలలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • విచారణకు ఆదేశించిన సీఎం

DGP Ramachandra Rao: కర్ణాటకలో డీజీపీ హోదాలో ఉన్న రామచంద్రరావు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆఫీస్ లోనే మహిళలతో రామచంద్రరావు అనుచితంగా ప్రవర్తించినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. బాధ్యతగా ఉండాల్సిన అధికారి ఇలా ప్రవర్తించడం ఏంటని అంతా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీంతో సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేసి వివరణ ఇవ్వాలని సంబంధిత శాఖకు సూచించారాయన. ఇక రాసలీలల వీడియోపై రామచంద్రరావు స్పందించారు. అది ఫేక్ వీడియో అని, మార్ఫింగ్ చేసిందని చెప్పుకొచ్చారు. తనను ఉద్యోగం నుంచి తొలగించేందుకు తన పైఅధికారులు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఆరోపించారు.

కాగా, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన రన్యారావు తండ్రే ఈ రామచంద్రరావు. 2025లో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బంగారం అక్రమ రవాణ కేసులో రామచంద్రరావు పేరు వాడుకునే ఎయిర్ పోర్టుల్లో భద్రతా తనిఖీలను రన్యారావు తప్పించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

రామచంద్రరావు కర్ణాటక సీనియర్ పోలీస్ అధికారి. 1993 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్. డీజీపీ ర్యాంక్ అధికారిగా ఉన్నారు. కాగా, తన కార్యాలయంలో పలువురు మహిళలతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. డీజీపీ ఆఫీస్ లో పని చేసే సిబ్బందే ఈ దృశ్యాలను సీక్రెట్ గా వీడియో తీసినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణ సమయంలో సీనియర్‌ అధికారి ఇలా ప్రవర్తించడం ఏంటని అంతా మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. నిజమని తేలితే రామచంద్రరావుపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.