Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీశ్ రావుకి సిట్ నోటీసులు

రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు పేర్కొన్నారు.

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీశ్ రావుకి సిట్ నోటీసులు

Harish Rao Representative Image (Image Credit To Original Source)

Updated On : January 19, 2026 / 9:32 PM IST
  • రేపు విచారణకు రావాలని హరీశ్ రావుకి సిట్ నోటీసులు
  • హరీశ్, కేసీఆర్, కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న వ్యవహారం
  • ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత తీవ్ర వ్యాఖ్యలు

 

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం. బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి హరీశ్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రస్తుతం హరీశ్ రావు సిద్ధిపేటలో ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణకు హాజరుకానున్నారు.

హరీశ్ రావుకి సిట్ నోటీసుల వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటివరకు అధికారులకు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారించారు. ముఖ్యంగా రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు చుట్టే ఈ వ్యవహారం తిరుగతూ వచ్చింది. ఈ వ్యవహారంలో తర్వాత హరీశ్ రావు, కేసీఆర్ లకు నోటీసులు ఇస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది. శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు, హరీశ్ రావు ఆదేశాల చుట్టూ తిరుగుతూ వచ్చింది.

సిట్ నోటీసులతో రాజకీయాల్లో ప్రకంపనలు..

గతంలో సిద్ధిపేటకు చెందిన ఒక వ్యక్తి హరీశ్ రావుపై ఇచ్చిన ఫిర్యాదుతో పోలీస్ కేసు నమోదైంది. దీనిపై హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆన ఊరట లభించింది. తర్వాత సుప్రీంకోర్టుకి చేరింది. ఫోన్ ట్యాపింగ్ లో హరీశ్ రావు హస్తం ఉందంటూ చంద్రశేఖర్ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టులోనూ హరీశ్ రావుకి పాజిటివ్ గా వచ్చింది. హరీశ్ రావు పై వేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ కి సిట్ నోటీసులు ఇవ్వడం కచ్చితంగా రాజకీయంగా ప్రకంపనలు రేపు అంశంగా చూడాలి.

కాగా, హరీశ్ రావు హోంమంత్రిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ పదేళ్లు పని చేసింది లేదు. ఇంటెలిజెన్స్ కానీ పోలీసు అధికారులు కానీ ఎన్నడూ హరీశ్ రావు కంట్రోల్ లో లేరు. ఆర్థిక, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్ శాఖల మంత్రిగా మాత్రమే పని చేశారు. ఈ రకంగా చూస్తే పోలీస్ వ్యవహారంతో కానీ ఫోన్ ట్యాపింగ్ తో కానీ హరీశ్ రావుకి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రమేయం ఉండే అవకాశమే లేదు. అయితే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు, మరికొందరు పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను బేస్ చేసుకుని హరీశ్ రావుని విచారణకు పిలిచారా? లేక మరో కారణం ఏమైనా ఉందా? అనేది తేలాల్సి ఉంది.

ఫోన్ ట్యాపింగ్ అంశంలో కవిత సంచలన వ్యాఖ్యలు..

గతంలో బండి సంజయ్ తదితరులు సిట్ విచారణకు వెళ్లారు. తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగింది అనే అనుమానాలను వారు వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా చూపించారు. ఈ మధ్య కాలలో హరీశ్, కేటీఆర్, కేసీఆర్ చుట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతోంది. ముగ్గురిని విచారణకు పిలుస్తారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య కవిత కూడా ఫోన్ ట్యాపింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తారా? మీకు సిగ్గుందా? అని కవిత ప్రశ్నించారు.

Also Read: జూపల్లి టు భట్టి.. మంత్రుల చుట్టూ వరుస వివాదాలు.. సీఎం ఏం చేయబోతున్నారు?