Telangana Assembly Election 2023 Result: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. రేపే ప్రమాణ స్వీకారం
తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీకి ముందే ఆయనను ముఖ్యమంత్రిగా ఏఐసీసీ నియమించింది

తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీకి ముందే ఆయనను ముఖ్యమంత్రిగా ఏఐసీసీ నియమించింది. సీఎల్పీ భేటి నేపథ్యంలో హోటల్ ఎల్లాకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా అదిలాబాద్, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రావడానికి అర్ధరాత్రి సమయం దాటే అవకాశం ఉంది. దీంతో సీఎల్పీ భేటీని రేపు ఉదయం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
LIVE NEWS & UPDATES
-
గవర్నర్ ను కలిసి కాంగ్రెస్ నేతలు
గవర్నర్ తమిళిసైని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, డీకే శివకుమార్, ఉత్తమ్ ఇతర కాంగ్రెస్ నేతలు కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని గవర్నర్ కు వివరించారు. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ ను కాంగ్రెస్ నేతలు కోరారు. కాగా, ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
-
రేపు ఉదయం 9:30 గంటలకు సీఎల్పీ భేటీ
రేపు ఉదయం 9:30 గంటలకు సీఎల్పీ భేటీ ఉంటుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. సీఎల్పీ భేటీ కోసం ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాకు చేరుకుంటున్నారు. అయితే ఈ భేటీ రేపు ఉదయం ఉండనుందని డీకే క్లారిటీ ఇచ్చారు.
-
రాజ్ భవన్ కు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎన్నికల్లో విజయం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం రాత్రే రాజ్ భవన్ కు బయల్దేరారు. రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఈరోజే వీరు రాజ్ భవన్ కు వెళ్తుండడం గమనార్హం.
-
హోటల్ ఎల్లాకు చేరుకుంటున్న ఎమ్మెల్యేలు
సీఎల్పీ భేటి నేపథ్యంలో హోటల్ ఎల్లాకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా అదిలాబాద్, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రావడానికి అర్ధరాత్రి సమయం దాటే అవకాశం ఉంది. దీంతో సీఎల్పీ భేటీని రేపు ఉదయం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ రోజంతా కౌంటింగ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అలసిపోయిన కారణంగా వారికి రెస్టు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం సీఎల్పీ బేటి అనంతరం గవర్నర్ కు వినతి పత్రం కాంగ్రెస్ నేతలు ఇవ్వనున్నారు.
-
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ భేటీకి ముందే ఆయనను ముఖ్యమంత్రిగా ఏఐసీసీ నియమించింది.
-
తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా
తెలంగాణ డీజీపీగా ఉన్న అంజని కుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతరం రవిగుప్తాను కొత్త డీజీపీగా ఎన్నికల సంఘం నియమించింది. కౌంటింగ్ జరుగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.
-
కాసేపట్లో సీఎల్పీ భేటి
ప్రభుత్వ ఏర్పాటు గురించి మరికాసేపట్లో సీఎల్పీ భేటీ కానుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ప్రస్తుత సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సహా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తదుపరి సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అయితే అది రేవంత్ రెడ్డా లేదంటే భట్టి విక్రమార్కనా అనేది సమావేశం అనంతరం తెలుస్తుంది.
-
కేసీఆర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అనంతరం రాజీనామాను రాజ్ భవన్ కు పంపగా.. అది గవర్నర్ తమిళిసైచే ఆమోదం పొందింది.
-
కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ
కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 25వ రౌండ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్లతో కలిపి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 3,284 ఓట్లతో లీడులో ఉన్నారు. మొరాయించిన రెండు ఈవీఎంలు లెక్కించకుండా పక్కన అధికారులు పెట్టారు. పోస్టల్ బ్యాలెట్లు కలిపి గంగుల కమలాకర్ కు దక్కిన మొత్తం ఓట్లు 91756. పోస్టల్ బ్యాలెట్లు కలిపి బండి సంజయ్ కి 88,472 ఓట్లు వచ్చాయి. ఇరు నేతల మధ్య స్వల్ప తేడా ఉండడంతో బీజేపీ రీకౌంటింగ్ కోరింది. అభ్యంతరం తెలిపిన బ్యాలెట్ యూనిట్లకు సంబంధించిన వీవీప్యాట్లలో పోలైన స్లిప్పులను వీడియో చిత్రీకరణ చేస్తూ అధికారులు రీకౌంటింగ్ చేస్తున్నారు. అయితే ఎవరిది విజయమనేది అధికారులు ధృవీకరించకపోవడంతో ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది.
-
ప్రతిపక్ష పాత్ర పోషించమని బాధ్యత ఇచ్చారు: కేటీఆర్
ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని, దాన్ని తాము సమర్థవంతంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఈ ఎదురు దెబ్బను గుణ పాఠం గా నేర్చుకుంటామని, ఎన్నో ఎత్తు పల్లాలు చూశామని, ఫలితం ఎలాంటిదైనా రాబోయే రోజుల్లో మరింత బాగా పని చేస్తామని ఆయన అన్నారు. కార్యకర్తల శ్రమ పోరాట ఫలితం కారణంగా 39 స్థానాలు వచ్చాయని అన్న ఆయన పదేళ్లుగా తమకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని కేటీఆర్ అన్నారు.
-
అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు ..
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల ప్రవర్తనానియమాలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడికాకముందే రేవంత్ ను కలిసి పుష్పగుచ్చం ఇవ్వడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీది అత్యుత్సాహంగా ఈసీ పరిగణించింది. అంజనీకుమార్ తో రేవంత్ కు పుష్పగుచ్చం అందించిన సంజయ్ కుమార్, మహేశ్ భగవత్ కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
-
రేపే తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో ఆ పార్టీ అధికారాన్ని చేపట్టనుంది. అయితే, రేపు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. కానీ, మెజార్టీ బోటాబొటీగా ఉన్నందున వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, రేపు ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
-
సొంత వాహనంలో ఫాంహౌస్ కు వెళ్లిన కేసీఆర్
సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు పంపించారు. ప్రగతి భవన్ నుంచి సొంత వాహనంలో కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్లారు.
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మ్యాజిక్ ఫిగర్ కంటే అధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైంది. కాంగ్రెస్ కు ప్రజలు మెజార్టీ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ రాజీనామా చేయనున్నారు.
-
సంగారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓటమి పాలయ్యాడు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయం సాధించారు.
-
చెన్నూరులో కాంగ్రెస్ విజయం..
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ విజయం సాధించారు. 36,618 ఓట్ల మెజార్టీతో వివేక్ గెలుపొందారు.
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా..
-
నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ..
నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణిక రెడ్డి విజయం సాధించారు. 7950 మెజారిటీతో ఆమె గెలుపొందారు.
-
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం ..
కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. రెండో స్థానంలో కేసీఆర్ నిలవగా.. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
-
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఈ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా.. 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
మహబూబ్ నగర్ - యెన్నం శ్రీనివాస్ రెడ్డి
దేవరకద్ర - జి.మధుసూదన్ రెడ్డి
జడ్చర్ల - అనురుధ్ రెడ్డి.
షాద్ నగర్ - వీర్లపల్లి శంకర్.
కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణ రెడ్డి.
మఖ్తల్ - శ్రీహరి.
నారాయణ పేట - చిట్టెం పర్ణిక
నాగర్ కర్నూలు - కుచకుల రాజేష్ రెడ్డి.
అచ్చంపేట - వంశీకృష్ణ.
కొడంగల్ - రేవంత్ రెడ్డి
కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు.
వనపర్తి - తూడి మేగారెడ్డి.
బీఆర్ఎస్ అభ్యర్థులు ..
అలంపూర్ .. విజేయుడు.
గద్వాల. . కృష్ణామోహన్ రెడ్డి.
-
కేటీఆర్ విజయం ..
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ విజయం సాధించారు.
-
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ విజయం సాధించారు.
-
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కూచకుళ్ల రాజేష్ రెడ్డి విజయం సాధించారు.
-
పొంగులేటి విజయం..
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై ఆయన గెలుపొందారు.
-
మంత్రి నిరంజన్ రెడ్డి పరాజయం ..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మంత్రి, వనపర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి టి. మేఘారెడ్డి నిరంజన్ రెడ్డిపై విజయం సాధించారు.
-
భట్టి విక్రమార్క విజయం..
మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. 36వేల ఓట్లకుపైగా మెజార్టీతో భట్టి గెలుపొందారు.
-
తలసాని గెలుపు
సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు.
-
రేవంత్ రెడ్డి ర్యాలీలో టీడీపీ జెండాలు..
-
మిర్యాలగూడలో కాంగ్రెస్ విజయం..
మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
-
కొల్లాపూర్ లో జూపల్లి గెలుపు
కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.
-
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం..
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 13వ రౌండ్ ముగిసే సమయానికి 625 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో కేటీఆర్, మూడో స్థానంలో కేసీఆర్ ఉన్నారు.
-
గొోషామహల్ లో రాజాసింగ్ విజయం..
గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ (బీజేపీ) విజయం సాధించింది.
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఓడిన గద్దర్ కూతురు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలయ్యారు. ఆ స్థానం నుంచి భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు.
-
కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయం
కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం సాధించారు. 5,429 ఓట్ల మెజార్టీతో కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపొందారు.
-
షాద్ నగర్ లో కాంగ్రెస్ విజయం ..
షాద్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ విజయం సాధించారు.
-
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు విజయం..
మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయం సాధించారు. 27,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
కొడంగల్ లో రేవంత్ భారీ విజయం..
కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భారీ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్లతో రేవంత్ విజయం సాధించారు.
-
బాన్సువాడలో బీఆర్ఎస్ విజయం..
బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.
-
మంత్రి మల్లారెడ్డి విజయం ..
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి విజయం సాధించారు. 30వేలకుపైగా ఓట్లతో ఆయన గెలుపొందారు.
-
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి ..
నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
-
నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ విజయం..
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవ్ రెడ్డి విజయం సాధించారు. 5వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
-
ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం..
హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 46,748 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం..
భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.
-
కామారెడ్డిలో రేవంత్ ఆధిక్యం..
కామారెడ్డి నియోజకవర్గంలో 2వేల ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
-
గాంధీ భవన్ చేరుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
-
కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం..
నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.
-
దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం..
దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
-
సీఎం అభ్యర్థిపై కోమటిరెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖరారైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానా? లేదా అనేది అప్రస్తుతం అన్నారు. పీసీసీ అధ్యక్షుడు కాబట్టే రేవంత్ రెడ్డిని డీజీపీ కలిశారని అన్నారు.
-
గాంధీభవన్‌కు రేవంత్ రెడ్డి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు.
-
అంబర్ పేటలో బీఆర్ఎస్ విజయం
అంబర్ పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం సాధించారు.
-
దక్షిణ భారత్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది .. డీకే శివకుమార్
-
రేవంత్ ఇంటికి డీజీపీ
తెలంగాణ ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రేవంత్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
#WATCH | Telangana DGP Anjani Kumar and other Police officials meet state Congress president Revanth Reddy at his residence in Hyderabad.
The party is leading on 65 of the total 119 seats in the state, ruling BRS is leading on 38 seats. pic.twitter.com/m6A9llRzgO
— ANI (@ANI) December 3, 2023
-
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో దామోదర్ హవా ..
దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్) 7015 ఓట్లు
క్రాంతికిరణ్ (బిఆర్ఎస్) 5376 ఓట్లు
బాబుమోహన్ (బిజెపి) 499 ఓట్లు
ప్రకాశం (బిఎస్పీ) 46 ఓట్లుపదకొండవ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ 16310 ఓట్ల ఆధిక్యం
-
రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ..
రామగుండంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై రాజ్ ఠాకూర్ విజయం సాధించారు.
-
ఎంఐఎం విజయం
చార్మినార్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మీర్ జల్ఫీకర్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై అలీ విజయం సాధించారు.
-
కేటీఆర్ ముందంజ
సిరిసిల్ల నియోజకవర్గంలో పదవ రౌండ్ ముగిసేసరికి 17,305 ఓట్ల ఆధిక్యంతో కేటీఆర్ ముందంజలో ఉన్నారు.
-
గజ్వేల్ లో కేసీఆర్ ఆధిక్యం..
గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి
బీఆర్ఎస్ : 4712
కాంగ్రెస్ : 1296
బీజేపీ : 3461అధిక్యం :1251 కేసీఆర్ ఆధిక్యం
మొత్తం ఆధిక్యం : 5777 +1251=7028
-
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజక వర్గం ఐదవ రౌండ్ ముగిసేసరికి
బీజేపీ : 14075
బీఆర్ఎస్ : 18204
కాంగ్రెస్ : 11753
ఐదవ రౌండ్లు బీఆర్ఎస్ ఆధిక్యం : 4129
-
కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి ఆధిక్యం..
కొత్తగూడెం నియోజకవర్గoలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు 16,449 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి సీపీఐ అభ్యర్థికి
బీఆర్ఎస్ (వనం వెంకటేశ్వరరావు) : 8,133
సీపీఐ (కూనంనేని సాంబశివరావు) : 27,389
ఫార్వార్డ్ బ్లాక్ (జలగం వెంకట్రావు) : 10,940
-
కాంగ్రెస్ రెండో విజయం నమోదు ..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కొత్తగూడెం భద్రాచలం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో జారే ఆధినారాయణ ఘన విజయం సాధించారు. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు.
-
హస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 6,235 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఓటమి దిశగా 09 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
వరంగల్ పశ్చిమ - 03 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి 2399 ఓట్ల ఆధిక్యం..
వరంగల్ తూర్పులో - 03రౌండ్లు ముగిసే సరికి 6271 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ
భూపాలపల్లి లో - 4వ రౌండ్ ముగిసే సరికి 9289 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు
పాలకుర్తి లో - 5వ రౌండ్ ముగిసే వరకు 5297 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి
వర్దన్నపేటలో - 7వ రౌండ్ ముగిసే వరకు 6413 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి KR నాగరాజు
ములుగు లో - 07వ రౌండ్ ముగిసే సరికి 10,080 ఓట్ల ఆధిక్యంతో సీతక్క..
మహబూబాబాద్ - 05వ రౌండ్ ముగిసే సరికి 10,074 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ ముందంజ
డోర్నకల్ - 03వ రౌండ్ ముగిసే సరికి 11178 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రనాయక్
స్టేషన్ ఘనపూర్ - 07 వ రౌండ్ ముగిసే సరికి 6329 ఓట్ల ఆధిక్యంలో BRS అభ్యర్థి కడియం శ్రీహరి
జనగామ - 04 వ రౌండ్ ముగిసే సరికి 5031 ఓట్ల ఆధిక్యంలో BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి
పరకాల - 04వ రౌండ్ ముగిసే సరికి 1401 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి
నర్సంపేట - 10వ రౌండ్ ముగిసే సరికి 4,132 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి
-
కాంగ్రెస్ అభ్యర్థి విజయం ..
అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విజయం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
మూడో రౌండ్ లో గోపీనాథ్ ఆధిక్యం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు 7667ఓట్లు.
కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కు 6617 ఓట్లు.
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 3927 ఓట్లు
ఎంఐఎం అభ్యర్థికి 3374 ఓట్లు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 1050 లీడ్ సాధించాడు.
-
సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం..
#WATCH | #TelanganaElection2023 | Congress workers pour milk on a poster featuring Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and state party chief Revanth Reddy as the party continues its lead in the state.
As per the official EC trends, the… pic.twitter.com/IWi4QEz4EQ
— ANI (@ANI) December 3, 2023
-
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ 710 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
-
కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ సీట్లను దాటి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీంతో గాంధీ భవన్, రేవంత్ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Congress cadre burst firecrackers outside the office of the party's state unit in Hyderabad as the party leads on 52 seats in Telangana pic.twitter.com/3Agy3Ha0rt
— ANI (@ANI) December 3, 2023
-
మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్కకు 10,499 ఓట్ల ఆధిక్యం.
-
వెనుకంజలో ఉన్న మంత్రులు ..
నిరంజన్ రెడ్డి (వనపర్తి)
పువ్వాడ అజయ్ (ఖమ్మం)
ఎర్రబెల్లి దయాకర్ (పాలకుర్తి)
కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి)
శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్)ఆధిక్యంలో ఉన్న మంత్రులు..
కేటీఆర్ (సిరిసిల్ల)
హరీశ్ రావు (సిద్దిపేట)
మల్లారెడ్డి (మేడ్చల్)
జగదీశ్వర్ రెడ్డి (సూర్యాపేట)
మంత్రి సబిత (మహేశ్వరం)
-
ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీల ఆధిక్యం..
హైదరాబాద్ లో.. బీఆర్ఎస్ 7, కాంగ్రెస్1, బీజేపీ 2, ఎంఐఎం రెండు స్థానాల్లో ఆధిక్యం.
కరీంనగర్ జిల్లాలో .. బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యం
ఖమ్మం జిల్లాలో .. బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 8స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో ఆధిక్యం.
మెదక్ జిల్లాలో .. బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యం.
రంగారెడ్డి జిల్లాలో .. బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యం.
వరంగల్ జిల్లాలో.. బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యం.
మహబూబ్ నగర్ జిల్లాలో ... బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యం.
అదిలాబాద్ జిల్లాలో .. బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 4, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం.
నిజామాబాద్ జిల్లాలో.. బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 5, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యం.
నల్గొండ జిల్లాలో.. బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 11 స్థానాల్లో ఆధిక్యం.
-
నాగార్జున సాగర్ సెగ్మెంట్ : మూడో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్ధి జైవీర్ రెడ్డి 6,601 ఓట్ల ఆధిక్యం.
మిర్యాలగూడ సెగ్మెంట్ : 5వ రౌండ్ ముగిసే సరికి 10,721 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి
-
మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి 2687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
అశ్వారావుపేట నియోజకవర్గంలో 10,612 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
పినపాక నియోజకవర్గంలో 8648 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న కాంగ్రెస్ అబ్యర్థి ఉత్తమ్. 5వ రౌండ్ ముగిసే సరికి 15,244 ఓట్ల ఆధిక్యం.
కొడంగల్ నియోజకవర్గంలో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి 7045 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
రామగుండంలో 18,455 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
-
సిరిసిల్ల నియోజక వర్గం
మూడవ రౌండ్...కాంగ్రెస్ - 2386
బీఅర్ఎస్ - 3446
బీజేపీ - 1029బిఆర్ఎస్ లీడ్ - 1060
రెండవ రౌండ్ బిఆర్ఎస్ కెటిఆర్ లీడ్ - 2621
-
మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 1701 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్
-
సిద్దిపేట నియోజకవర్గంలో మూడో రౌండ్ ఫలితాలు
బిఆర్ఎస్ :6430
కాంగ్రెస్ :1219
బిజెపి :926
బీఎస్పీ :453
నోట:55
అదిక్యం : 5211 హరీష్ రావు ఆధిక్యం
-
ఖమ్మంలో తుమ్మల, పువ్వాడ మధ్య హోరాహోరీ ..
ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు 796 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే, మూడో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ కు స్వల్ప ఆధిక్యత వచ్చింది.
మూడోవ రౌండ్లో
పువ్వాడకు 5954 ఓట్లు
తుమ్మలకు 4998 ఓట్లు
-
ఎల్బీనగర్ నియోజకవర్గంలో..
రెండవ రౌండ్ లో ఆధిక్యంలో BRS దేవిరెడ్డీ సుదీర్ రెడ్డి
బిఆర్ఎస్ : 4869 లిడ్...513
కాంగ్రెస్ ..2913
బీజేపీ :..4357
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది
ఆధిక్యంలో BRS ..1335
-
సిరిసిల్ల రెండోరౌండ్ పూర్తయ్యే సరికి 1,357 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్
మేడ్చల్ లో 5,606 ఓట్ల ఆధిక్యంలో మల్లారెడ్డి
-
వేములవాడలో 993 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
బోధన్ లో 2894 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
మునుగోడు రెండోరౌండ్ పూర్తయ్యే సరికి 1271 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
బెల్లంపల్లిలో 4700 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
దేవరకొండలో 1890 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
-
హుజూర్ నగర్ లో నాలుగో రౌండ్ ముగిసేసరికి 11,677ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజ.
-
జడ్చర్ల నియోజకవర్గంలో 1512 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
-
చెన్నూరు నియోజకవర్గం మొదటి రౌండు లో ..
1) గడ్డం వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్). 6134
2) బాల్క సుమన్ (బిఆర్ఎస్) 4046
3) దుర్గం అశోక్ ( బిజెపి) 353
అదిక్యం : కాంగ్రెస్ 3088
-
హుజూరాబాద్ లో ఈటెల వెనుకంజ
ఈటెల 2548
కౌశిక్ రెడ్డి 3907
ప్రణవ్ 2846
కౌశిక్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు.
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి ఆధిక్యం.
మధిర రెండో రౌండ్ ముగిసే సరికి భట్టి విక్రమార్క 4075 ఓట్ల ఆధిక్యం.
పాలేరు నియోజకవర్గంలో 3181 ఓట్ల ఆధిక్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కొత్తగూడెం నియోజకవర్గంలో కూనంనేని సాంబశివరావు లీడ్కొత్తగూడెం నియోజకవర్గం మొదటి రౌండ్ ..
బిఆర్ఎస్ (వనమా వెంకటేశ్వరరావు) : 1137
సీపీఐ (కూనంనేని సాంబశివరావు) : 5666
ఫార్వార్డ్ బ్లాక్ (జలగం వెంకటరావు) : 2308
-
అదిలాబాద్ తొలి రౌండ్ లో 1035 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి
-
అచ్చంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా వంశీకృష్ణ 1979 ఓట్లతో ఆధిక్యం.
కల్వకుర్తి నియోజకవర్గంలో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ్ రెడ్డి 1,174 ఓట్లతో ముందంజ
-
ఆధిక్యంలో తలసాని, మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి 3వేల ఓట్ల ఆధిక్యం
సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
మొదటి రౌండ్
బిఆర్ఎస్ (తలసాని)- 4330
కాంగ్రెస్ (నీలిమ)-869
బిజెపి(శశిధర్ రెడ్డి)-3397
తలసాని ఆధిక్యం -933సికింద్రాబాద్ లో తొలి రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం.
-
తుమ్మల ముందంజ..
ఖమ్మం నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి తుమ్మల ఆధిక్యంలో ఉన్నారు. తొలిరౌండ్ లో 129 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
బీఆర్ఎస్ 5393
కాంగ్రెస్ 5519
-
కామారెడ్డిలో రేవంత్ ఆధిక్యం..
కామారెడ్డి నియోజకవర్గంలో రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కొడంగల్ నియోజకవర్గం.. మొదటి రౌండ్లో 1300 ఓట్లతో రేవంత్ రెడ్డి ముందంజ.
-
కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి 1684 ఓట్ల ముందంజ.
-
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 1300 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
-
సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి BRS అభ్యర్థి పద్మారావు 3309 ఓట్లతో ముందంజ
-
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో 471 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్
బీఆర్ఎస్ 3288
బీజేపీ 2817
కాంగ్రెస్ 1482
-
ఖమ్మం జిల్లాలో..
మొదటి రౌండ్ ముగిసే వరకు పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2,200 ఓట్లతో ముందంజ.
మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క 1984 ఓట్ల ఆధిక్యం
-
చార్మినార్ నియోజకవర్గంలో బీజేపీ ముందంజ.
మొదటి రౌండ్ లో ఓట్లు..
బీజేపీ 4214
ఎంఐఎం 1674
-
- ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రౌండ్లో 720 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య ముందంజ
- భూపాలపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మొదటి రౌండులో 1988 ఓట్ల ఆధిక్యం
- హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ముందంజ
-
- పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి మొదటి రౌండ్లో 738 ఓట్ల ఆధిక్యం
- మొదటి రౌండ్ లో నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 2408 ఓట్ల లీడ్
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆదిక్యం..
-
పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ హవా..
Postal Ballot
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో.. మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
ఆధిక్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి.. ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మొదటి రౌండ్ లో హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజ
యాదాద్రి: మొదటి రౌండ్ లెక్కింపులో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వల్ప ఆధిక్యత
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భాగంగా.. ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
-
పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ హవా
కొడంగల్ నియోజకవర్గం.. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ
నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజ
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజ
ఖైరతాబాద్ నియోజికవార్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ముందంజ
-
ఖమ్మంలో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ
తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
-
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు.
చాంద్రాయణగుట్టలో ఎంఐఎం ఆధిక్యం
కరీంనగర్ లో బండి సంజయ్ ఆధిక్యం
మధిరలో భట్టి విక్రమార్క ఆధిక్యం
కామారెడ్డిలో రేవంత్, కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఆధిక్యం
-
వికాస్ రాజ్ సమీక్ష
హైదరాబాద్.. ఈసీ ఆఫీస్ లోని కంట్రోల్ రూమ్ నుంచి కౌంటింగ్ ప్రక్రియను సీఈఓ వికాస్ రాజ్ సమీక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో విడివిడిగా వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు.
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును కౌంటింగ్ సిబ్బంది ప్రారంభించారు.
-
మొదలైన హడావుడి..
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు హడావుడి మొదలైంది. కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాప్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారు.
-
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత..
తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మూడంచెల భద్రత ఏర్పాటుతోపాటు కౌంటింగ్ సరళిని సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించారు.
-
తొలుత భద్రాచలం ఫలితం..
మొత్తం 119 నియోజకవర్గాలకు 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణలో మొదటగా భద్రాచలం నియోజకవర్గం ఫలితం వెలువడనుంది. 13 రౌండ్లలో ఇక్కడ కౌంటింగ్ పూర్తవుతుంది. భద్రాచలం ఓట్ల లెక్కింపు తరువాత అశ్వరావుపేట నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది. 14 రౌండ్లలో ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చివరగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితం వెల్లడవుతుంది. ఇక్కడ 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
-
ఓట్ల సంఖ్య, పోలింగ్ స్టేషన్లను బట్టి 14 నుంచి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో 28చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కు మైక్రో అబ్జర్వర్, సూపర్ వైజర్ ఉంటారు.
-
తెలంగాణ ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో 2.32 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గతనెల 30న పోలింగ్ జరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా 71.34శాతం పోలింగ్ నమోదైంది.
-
ఉదయం 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు..
ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 14 కౌంటింగ్ కేంద్రాలు, హైదరాబాద్ జిల్లాలో నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 31 జిల్లాల్లో జిల్లాకో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
-
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..
ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకోసం 131 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది.