Telangana Assembly Meetings : ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు రూ.3లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Telangana assembly meetings : ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు రూ.3లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల వరచు ఉండవచ్చని అంచనా. తుది బడ్జెట్ పై కసరత్తు జురుగుతోంది. బడ్జెట్ పద్దులపై సీఎం కేసీఆర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.

తెలంగాణ ఉబయ సభల ప్రారంభానికి సంబంధించి అసెంబ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. శాసనసభ ఎనిమిదో సెషన్ కొనసాగింపుగా నాలుగో విడత సమావేశాలంటూ ప్రకటన జారీ చేసింది. చేసింది. ఎనిమిది సెషన్ ను ప్రొరోగ్ చేయకుండా గత సమావేశాల కొనసాగింపుగా ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుండటంతో గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది.  మొత్తం ఈ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజుల నుంచి జరిగే అవకాశం ఉంది.

Supreme Court : ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రం, ఈసీకి నోటీసులు

ఎన్నికల ఏడాది కావడంతో రానున్న బడ్జెట్ లో కొత్త పథకాలు ఏమైనా ఉంటాయా? లేకపోతే పెంపులేమైనా ఉంటాయా? అన్నది చూడాలి. ఈ సంవత్సరంలో చివరి బడ్జెట్ కావడంతో కొత్త పథకాలకు ఏమైనా అవకాశం ఉంటుందా? లేక ఫెన్షన్లు ఏమైనా పెంచుతారా? అనే చర్చ జరుగుతోంది. బడ్జెట్ ప్రతిపాదనలను అన్ని శాఖలు సబ్ మిట్ చేయాలని ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అధికారులు పంపించారు. దీనిలో ఎక్కువగా ఇరిగేషన్ శాఖ నుంచి ప్రతిపాదనలను వచ్చినట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖలో ఈసారి కొత్త రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరినట్లు సమాచారం.

వైద్య ఆరోగ్యశాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు తోడు కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ గత బడ్జెట్ లో కేటాయించిన దాని కంటే ఈ సారి 8 శాతం నిధులు ఎక్కువగా కేటాయించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న దళితబంధు పథకం ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి ఇచ్చేలా కేటాయింపులు ఉండాలని ప్రతిపాదనలను పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Governor Tamilisai : గవర్నర్ ను సీఎం కేసీఆర్ అవమానించారు : గవర్నర్ తమిళిసై

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రిపబ్లిక్ డే విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తుందో లేదోనని గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా దూరం పెరిగింది. తెలంగాణ సర్కార్ గవర్నర్ కు మరోసారి ఝలక్ ఇచ్చింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై బడ్జెట్ ను ఆమోదించకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుంది. కాబట్టి బడ్జెట్ ను గవర్నర్ అనివార్యంగా ఆమోదించాల్సివుంటుంది.

ఇప్పటికే గవర్నర్ వద్ద ఎనిమిది బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అందులో విద్యాశాఖకు సంబంధించిన బిల్లులకు సంబంధించి మంత్రి రాజ్ భవన్ కు వెళ్లి వివరణ ఇచ్చారు. అయినా ఆ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదించలేదు. దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కేరళ, తమిళనాడులో కూడా గవర్నర్ వ్యవస్థ, గవర్నర్ విధానాలను అక్కడి ప్రభుత్వాలు తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాథం ఏర్పడింది.

ట్రెండింగ్ వార్తలు