Supreme Court : ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రం, ఈసీకి నోటీసులు

అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ వేశారు.

Supreme Court : ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రం, ఈసీకి నోటీసులు

Supreme Court

Supreme Court : అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ వేశారు.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, ఏపీ, కేంద్రం, ఈసీని పిటిషన్ లో ప్రతివాదులగా చేరారు.

Assembly Seats: అప్పటి వరకు ఆగాల్సిందే..! తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ కు జత చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.