Telangana : అక్టోబర్ 05 వరకు టి.అసెంబ్లీ సమావేశాలు ?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమైంది.

T.assembly
Telangana Assembly 2021 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరిగింది. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. అక్టోబర్ 05 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది.
Read More : AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత
అక్టోబర్ 20వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే..అక్టోబర్ 05వ తేదీ వరకు బిజినెస్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. 12 అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించాలని డిమాండ్ చేసింది. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం. తిరిగి 27వ తేదీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 01వతేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ..అక్టోబర్ 05వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం తాజగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
Read More : Telangana : అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం.. సోమవారానికి వాయిదా
2021, సెప్టెంబర్ 24వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో మృతి చెందిన మాజీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. సభలో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం శాసనమండలి, శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. కరోనా రూల్స్ పాటిస్తూ..సమావేశాలు జరుగుతాయని, సభ్యులు నియమ, నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం సూచించారు.