Telangana : ఒవైసీ మెప్పు కోసమే కొత్త సచివాలయాన్ని ఆ మోడల్‌లో కట్టించారు : బీజేపీ నేత వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజమహళ్ళు, రాచరిక పోకడలు కాదు.న్యూ సెక్రటేరియట్ లో మసీదుకు ఐదుగుంటల స్థలం ఇచ్చిన కేసీఆర్, నల్ల పోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి?

BJP leader NV Subhash
Telangana : బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్ తీవ్రంగా మండిపడ్డారు. ఎంఐఎం ఎంపీ ఒవైసీ మొప్పు కోసమే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని వందకి 100% ఓవైసీ డోములతో కట్టించారు అంటూ ఆరోపించారు. సచివాల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన బీజేపీ నేత అవినీతిని కచ్చితంగా బయట పెడతాం అని అన్నారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతు మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు… న్యూ సెక్రటేరియట్ లో మసీదుకు ఐదుగుంటల స్థలం ఇచ్చిన కేసీఆర్, నల్ల పోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అంటూ ప్రశ్నించారు. విశ్వ నగరం అని చెప్పుకునే హైదరాబాదులో మ్యాన్ హోల్లు పసిపిల్లల ప్రాణాలను మింగేస్తున్నా… ఎందుకు మిన్నకుంటున్నారు? పరిష్కారం కోసం ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజమహళ్ళు, రాచరిక పోకడలు కాదన్నారు సుభాష్.ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీజేపీపైనా, బండి సంజయ్ పై బీఆర్ఎష్ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తే… కేసీఆర్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని అన్నారు. కారు కూతలు కూసే నోర్లకు, అడ్డగోలుగా తెలంగాణ సొమ్మును దోచుకునే బీఆర్ఎస్ నేతలకు త్వరలోనే సమాధానం చెబుతామన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికింది ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు అంటూ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఉద్ధేంచి ఎద్దేవా చేశారు సుభాష్.
అన్నింటా దాచుకోవడం, దోచుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యంగా ఉందని ఓఆర్ఆర అనేది బీఆర్ఎస్ పార్టీకి బంగారు బాతుగా మారింది అంటూ విమర్శించారు. రూ. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను ప్రైవేటుకు కట్టబెట్టారని..ఏడాదికి రూ. 750 కోట్లు ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను, 246 కోట్లకే కట్టబెట్టడంలో మర్మమేంటో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఓట్ల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇన్నాళ్ళు అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు బయటకు రాని కేసీఆర్, ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కొత్త సచివాలయానికి ఆయన పేరు పెట్టినంత మాత్రాన దళిత సమాజం ఏమీ కేసీఆర్ ను నమ్మదన్నారు.
కేసీఆర్ కు ఇన్నాళ్లు గుర్తురాని అంబేద్కర్ ఎన్నికల ఏడాది ఉన్నాయనగానే గుర్తుకొచ్చారా? అంటూ నిలదీశారు. కేసీఆర్ కు ఎందుకు గుర్తుకు వస్తున్నారో దళిత సోదరులందరికి తెలుసని..దళితులపై కేసీఆర్ సర్కార్ దాడులు, లాకప్ డెత్ లు అన్నీ దళితులకు గుర్తున్నాయన్నారు. అసలు కనీస స్థాయి, అర్హత లేని బీఆర్ఎస్ నేతలు… ప్రధాని మోదీపై, బండి సంజయ్ పై విమర్శలు చేయడం చూస్తుంటే… విడ్డూరంగా ఉంది అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిథి సుభాష్.