ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజా సింగ్..భద్రత పెంపు

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నారా ? అంటే ఎస్ అంటోంది తెలంగాణ పోలీసు శాఖ. ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే అరెస్టయిన..ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఆయన పేరు ఉందని సమాచారం వచ్చింది.
దీంతో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు..ఎమ్మెల్యే ఇంటి వద్ద నూతన, అత్యాధునిక ఆయుధాలతో సిబ్బంది భద్రతను చేపడుతున్నారు.
https://10tv.in/rhea-chakraborthy-got-angered-when-media-surrounded-and-hits-the-car-windowpane-of-escort-car-with-elbow/
బైక్ పై తిరగవద్దని, ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగాలని రాజా సింగ్ కు హైదరాబాద్ కమిషనర్ సూచించారు. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షించనున్నారు.
తనకు ఎవరి నుంచి ఆపాయం ఉందో తెలుపాలని పోలీసులను రాజా సింగ్ కోరారు. ఆయనకు వివరాలు ఇచ్చేందుకు పోలీసు అధికారులు నిరాకరించనట్లు సమాచారం. దీంతో కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖ రాయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ యోచిస్తున్నారని తెలుస్తోంది.