Jithender Reddy (Photo : Twitter)
Telangana BJP – Jithender Reddy : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో బీజేపీ సీనియర్ల సమావేశం ముగిసింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు నిర్ణయించారు. పార్టీని బలహీనపరిచే లీకులను తిప్పికొట్టాలని సీనియర్లు డిసైడ్ అయ్యారు. పార్టీ మారేది లేదని, బీజేపీ బలోపేతం కోసం కృషి చేయాలని నిర్ణయానికి వచ్చారు.
జితేందర్ రెడ్డి-మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
”కేవలం మర్యాదపూర్వకంగానే మేమంతా సమావేశం అయ్యాం. మాకు ఇలాంటి రహస్య జెండా లేదు. పదవులు ఇచ్చే మందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదు. బీజేపీలో ప్రచార కమిటీ పదవి లేదు. బీజేపీ చీఫ్ ను మారుస్తున్నారని కేసీఆర్ లీకులు చేయిస్తున్నారు. బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్ పై కేసీఆర్ మాట్లాడుతున్నారు.
Also Read..Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్
గ్రామీణ స్థాయి నుంచి మా కేడర్ పని చేయకుండా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. వివిధ ఎన్నికల్లో మా సత్తా చూపించాం. పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరాలని కోరుతున్నా. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు.. కేసీఆర్ ను కొట్టాలంటే మీరు బీజేపీ వైపు రావాలి. రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించకుండా సెంట్రల్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోదు. మోదీ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని మహా జన సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళతాము”.