Jupally Krishna Rao: కాంగ్రెస్ ముఖ్యనేతలతో జూపల్లి వరుస భేటీలు.. పార్టీలో చేరిక ఎప్పుడంటే..?

జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో చేరేముందు ముఖ్య నేతలను కలుస్తున్నట్లు తెలుస్తోంది.

Jupally Krishna Rao: కాంగ్రెస్ ముఖ్యనేతలతో జూపల్లి వరుస భేటీలు.. పార్టీలో చేరిక ఎప్పుడంటే..?

Jupally Krishna Rao (File Photo)

Updated On : June 11, 2023 / 2:01 PM IST

Telangana Congress: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)  కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) తో ఆయన నివాసంలో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై వీరి మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహబూబ్ నగర్  జిల్లా (Mahbub Nagar District) లోని పలువురు కాంగ్రెస్ నేతలతోనూ జూపల్లి భేటీ అవుతూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో, శ్రీధర్ బాబుతో జూపల్లి భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం కావడంతో ఆ పార్టీలో చేరేముందు ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది.

Mallu Ravi: పొంగులేటి నిర్వహించనున్న ప్రెస్ మీట్‌పై జూపల్లితో చర్చించా: కాంగ్రెస్ నేత మల్లు రవి

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనేఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ  కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం నెలకొంటుంది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా ఏకతాటిపైకి వస్తుండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్న దీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో కాంగ్రెస్‌లో చేరేందుకు పలు పార్టీ నుంచి ముఖ్యనేతలు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

Ponguleti Srinivasa Reddy : కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పొంగులేటి, జూపల్లి కొద్దికాలంగా ఏ పార్టీలో చేరుతారన్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వారితో పలుదఫాలుగా చర్చలు జరుపుతూ వచ్చారు. అయినా ఏ పార్టీలో చేరేది వారు ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే, వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూపల్లి కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుస భేటీలు అవుతూ వస్తున్నారు. అయితే, వీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెలాఖరు వరకు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది.