T.budjet
Telangana budget : ఈనెల 26 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు 2021, మార్చి 15వ తేదీ సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈనెల 18న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 26న అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు 25రోజులపాటు జరపాలని కాంగ్రెస్ కోరింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సభలో చర్చించాలని బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ పట్టుబట్టింది.
సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది.
2021, మార్చి 17వ తేదీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ. దానిపై సమాధానం
– 2021, మార్చి 18వ తేదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం.
– 2021, మార్చి 19, 21వ తేదీలు హాలీడే.
– 2021, మార్చి 20, 22వ తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ.
– 2021, మార్చి 23, 24, 25వ తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ.
– 2021, మార్చి 26వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశం.