Telangana : కేసీఆర్ యాదాద్రి పర్యటన, రాయగిరిలో బహిరంగ సభ

జనగామలో కేంద్రంపైనా ప్రధాన మంత్రిపైనా విరుచుకుపడ్డ కేసీఆర్... యాదాద్రిలో నిర్వహించే బహిరంగసభలో కూడా విమర్శలను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయిు...

KCR Yadadri Tour : తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాల బాట పడుతున్నారు. శుక్రవారం జనగాంలో పర్యటించిన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి పయనమవుతారు సీఎం. మధ్యాహ్నం 12:30 గంటలకు యాదాద్రిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్స్‌ సూట్స్‌ ప్రారంభిస్తారు.

Read More : Statue of Equality : రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. 11వ రోజు, ఉప రాష్ట్రపతి రాక

మధ్యాహ్నం 1 గంటకు సుదర్శన మహా యాగం కోసం ఏర్పాటు చేసి యాగశాల పరిశీలించనున్నారు. అక్కడి నుంచి భువనగిరికి బయలుదేరుతారు. భువనగిరిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాయగిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. భువనగిరిలో జరిగే బహిరంగ సభ సక్సెస్ కోసం ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు.. నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి.. జిల్లా టిఆర్ఎస్ నేతలతో పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. సభ సక్సెస్ కోసం పాలుపంచుకుంటున్నారు.

Read More : అదేపనిగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఆరోగ్యానికి ముప్పే..!

ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గులాబీ శ్రేణులు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్యసభ కార్యాలయంలో ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. జనగామలో కేంద్రంపైనా ప్రధాన మంత్రిపైనా విరుచుకుపడ్డ కేసీఆర్… యాదాద్రిలో నిర్వహించే బహిరంగసభలో కూడా విమర్శలను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయిు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసి.. మరోసారి ప్రజల మెప్పు పొందే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల పర్యటన ప్రారంభించారని చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు