మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు

మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేశారు.

మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు

Somesh Kumar

Updated On : September 14, 2024 / 10:17 AM IST

Telangana CID Police : మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేశారు. రూ.1400 కోట్లు స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. వస్తువులు సరఫరా చేయకపోయిన చేసినట్లు బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఫేక్ ఇన్వాయిస్ లను సృష్టించి ఐటీసీని క్లయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Also Read : Arekapudi Gandhi : కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో.. అరెకపూడి గాంధీకి షాకిచ్చిన పోలీసులు

మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశి విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం.. ప్రసాద్ లకు సీఐడీ నోటీసులు పంపించింది. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్ మెంట్ ను సీఐడీ అధికారులు నమోదు చేయనున్నారు.