Telangana Congress First List : తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే..! 40మందితో జాబితా సిద్ధం..! 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
ఇంతకీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో ఉన్నది ఎవరు? రేసులో నిలబోతున్నది ఎవరు? ఆ 40మంది ఎవరు? Telangana Congress First List
T Congress First List : తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అయిపోయాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ రేసులో అధికార బీఆర్ఎస్ బాగా ముందుంది. గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు చూపించారు. అందరికన్నా ముందుగా తమ పార్టీ అభ్యర్థులను ఆయన ప్రకటించేశారు. 115 మంది అభ్యర్థులను ఖరారు చేసి కారు గేరు మార్చి సమరశంఖం పూరించారు.
ఇప్పుడు మేము కూడా సిద్ధం అంటూ సమరానికి కాలు దువ్వుతున్నారు కాంగ్రెస్ నేతలు. 40మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో హస్తం తొలి జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యక్తులు అభ్యర్థులుగా ఉండొచ్చని సమాచారం.
ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న వారి నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు కోరగా.. 119 నియోజకవర్గాలకు ఏకంగా 1025 దరఖాస్తులు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గానికి 38 దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి కేవలం ఒకే ఒక అప్లికేషన్ వచ్చింది. అది రేవంత్ రెడ్డి దాఖలు చేశారు.
40 మందికి సంబంధించిన జాబితాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయనుంది. ఇంతకీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో ఉన్నది ఎవరు? రేసులో నిలబోతున్నది ఎవరు? ఆ 40మంది ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌పై 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్. అయితే, అభ్యర్థులుగా వీరు ఉండొచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో అభ్యర్థులుగా ఎవరెవరు ఉన్నారో అని ఒకసారి పరిశీలిస్తే..
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. నియోజకవర్గాల వారీగా.. అభ్యర్థులుగా వీరు ఉండే అవకాశం
1. వరంగల్ జిల్లా
———————–
1. నర్సంపేట -దొంతి మాధవరెడ్డి
2. వరంగల్ తూర్పు – కొండా సురేఖ
3. ములుగు – సీతక్క
4. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
2. నల్లగొండ జిల్లా
——————
5. నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి
6. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
7. కోదాడ – పద్మావతి ఉత్తమ్
8. ఆలేరు – బీర్ల ఐలయ్య
3. మహబూబ్ నగర్
——————-
9. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
10 కల్వకుర్తి -వంశీ చంద్ రెడ్డి
11. అచ్చంపేట – వంశీ కృష్ణ
12. షాద్‌నగర్ – ఈర్లపల్లి శంకర్
13. కొడంగల్ – రేవంత్ రెడ్డి
14. అలంపూర్ – సంపత్ కుమార్
4. మెదక్
———
15. సంగారెడ్డి – జగ్గారెడ్డి
16. ఆందోల్ – దామోదర రాజనర్సింహా
17. జహీరాబాద్ – ఎ. చంద్రశేఖర్
18. నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్
5. ఆదిలాబాద్ జిల్లా
——————-
19. నిర్మల్ – శ్రీహరి రావు
20. మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
6. నిజామాబాద్ జిల్లా
———————-
21.జుక్కల్ – గంగారాం
22. కామారెడ్డి – షబ్బీర్ అలీ
7. రంగారెడ్డి జిల్లా
——————
23.వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
24. ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
25. పరిగి – టి.రామ్మోహన్ రెడ్డి
8. ఖమ్మం జిల్లా
—————
26. మధిర – భట్టి విక్రమార్క
27. భద్రాచలం – పొడెం వీరయ్య
28. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
9. కరీంనగర్ జిల్లా
—————–
29. మంథని- శ్రీధర్ బాబు
30. వేములవాడ- ఆది శ్రీనివాస్
31. జగిత్యాల- జీవన్ రెడ్డి
32. హుజురాబాద్- బల్మూరు వెంకట్
33. చొప్పదండి – మేడిపల్లి సత్యం
34. మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
35. రామగుండం – రాజ్ ఠాకూర్
36. పెద్దపల్లి – విజయ రమణా రావు
37. ధర్మపురి – లక్ష్మణ్
38. కోరుట్ల – జువ్వాడి నర్సింగ్ రావు
10. హైదరాబాద్
——————
39. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
40. జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
ఆ నియోజకవర్గాలకు వీరు అభ్యర్థులుగా ఉండొచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. మరికొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తమ రేసు గుర్రాలను అధికారికంగా ప్రకటించనుంది.
Also Read..Sai Chand : కోటి రూపాయల చెక్‌ను సాయిచంద్ భార్యకు అందజేసిన బీఆర్ఎస్ నేతలు